మరో హిట్ పెయిర్ గోపీచంద్- అనుష్క
గతంలో చిరంజీవి-రాధిక, బాలకృష్ణ-విజయశాంతి, రాజశేఖర్-జీవిత, నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహా, హిట్ పెయిర్. ఇలాంటి సక్సెస్ జంటలు చాలానే ఉన్నాయి. హీరోహీరోయిన్లు నటించిన ఒక సినిమా హిట్ అయితే చాలు, వారిది హిట్ పెయిర్ గా ముద్ర పడేది. నేడు హిట్ పెయిర్ అనే మాటే ఎక్కడా వినిపించడం లేదు. కారణం ఇప్పుడు అగ్రహీరోలు సంవత్సరానికి ఒకటీ, అర చిత్రాలకే పిరిమితం కావడమే. ఇలాంటి తరుణంలో ఓ హిట్ పెయిర్ మూడోసారి ముచ్చటగా నటించనుంది. 'లక్ష్యం", 'శౌర్యం", చిత్రల తర్వాత గోపీచంద్, అనుష్క కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుణ్ణి పరిచయం చేస్తూ ఈ మద్య హిట్ చిత్రం 'కిక్" అందించిన ఆర్.ఆర్ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
gopichand anushka laksham souryam chiranjeevi radhika balakrishna vijayashanthi గోపీచంద్ అనుష్క లక్ష్యం శౌర్యం ఆర్ఆర్ మూవీస్ హిట్ పెయిర్ చిరంజీవి రాధిక బాలకృష్ణ విజయశాంతి


Click it and Unblock the Notifications