HIT ప్రీ రిలీజ్ ఈవెంట్: చీఫ్ గెస్ట్ ఎవరంటే..

నాని నిర్మాణంలో తెరకెక్కిన HIT మూవీ ఈ నెల 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ భారీగా ఆదరణ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్రయూనిట్.

హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్న ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా అనుష్క శెట్టితో పాటు రానా, రాజమౌళి, రాఘవేంద్రరావు హాజరు కానుండటం విశేషం.

HIT Pre Release event.. Chief Guest is

నాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, రుహాని శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ అమ్మాయి మిస్సింగ్ కేసుకు సంబంధించిన మిస్టరీ చుట్టూ ఈ కథ నడవనున్నట్టు టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమైంది. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది.

శైలేశ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నానితో పాటు ప్రశాంతి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా విశ్వక్ సేన్ కేరీర్‌ని మలుపుతిప్పే మూవీ అవుతుందని టాక్ నడుస్తోంది. ఈ థ్రిల్లింగ్ మూవీ చూడాలని ప్రేక్షకుల్లో ఆత్రుత నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X