డ్రైవర్ సీట్లో సురేష్ బాబు?.. హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం.. నేను కారు నడపలేదని..!
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టడం వల్ల ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సురేష్ బాబు స్వయంగా టీఎస్ 09 ఈఎక్స్ 2668 కారు నడుపుతూ తమ వాహనాన్ని ఢీకొట్టారని బాధితులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు సురేష్ బాబు కేసు నమోదు చేసి నోటీజులు పంపినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే..

బాధితుడు చెప్పిన విషయం..
బాధితుడు సతీష్ చంద్ర కథనం ప్రకారం.. నేను, నా భార్య దుర్గాదేవి (30), నా మూడేళ్ల కుమారుడు సిద్దేశ్ హోండా యాక్టివాపై ప్రయాణిస్తున్నాం. సురేష్ బాబు ఉన్న వాహనం నా బైక్‌ను కార్ఖానా సమీపంలో ఢీకొట్టడంతో రోడ్డు పక్కన పడిపోయాం. ప్రమాదం జరిగిన వెంటనే మమ్మల్ని కొందరు స్థానిక హాస్పిటల్‌కు అంబులెన్స్‌లో తరలించారు అని వెల్లడించారు.

డ్రైవర్ సీట్లో సురేష్ బాబు
మేము కేపీహెచ్‌బీ కాలనీ నివాసిస్తాం. లాలాగూడలో ఉండే బంధువుల ఇంటికి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది. సురేష్ బాబు కారు డ్రైవర్ సీటులో ఉన్నారు. రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టాడు. వాహనాన్ని ఆపకుండా సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు అని బాధితులు చెప్పినట్టు ప్రముఖ వెబ్‌సైట్ ప్రచురించింది.

సురేష్ బాబుపై ఐపీసీ సెక్షన్ ..
బాధితుల ఫిర్యాదు మేరకు నిర్మాత సురేష్ బాబుపై ఐపీసీ సెక్షన్ 337 ప్రకారం కేసు నమోదు చేశారు. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ 41 ప్రకారం నోటీసులు అందించారు. నోటీసులకు అనుగుణంగా విచారణకు సహకరించాలని పోలీసులు కోరినట్టు తెలిసింది.

సురేష్ బాబు కారు నడపడం లేదు
హిట్ అండ్ రన్ కేసులోగానీ, వాహనం ప్రమాదంపై సురేష్ బాబు స్పందించలేదు. కానీ ఆయన తరఫున ఓ వ్యక్తి స్పందించినట్టు కథనంలో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సురేష్ బాబు కారు నడపడం లేదు. కానీ కారు ఆయన పేరుపై ఉన్నందున.. పోలీసులు సురేష్ బాబుపై కేసు నమోదు చేశారు అని చెప్పినట్టు తెలిసింది.

కేసులో ట్విస్టు.. కొత్త మలుపు
పోలీసులు నమోదు చేసిన హిట్ అండ్ రన్ కేసులో భిన్న వాదనలు వినిపించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు స్వయంగా సురేష్ బాబు కారు నడుపుతున్నారనే చెప్తుండగా.. నిర్మాత సన్నిహితుడు కారు నడపడం లేదని చెప్పినట్టు వార్త రావడం గందరగోళానికి దారి తీసింది.


Click it and Unblock the Notifications











