For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ కోర్టుకు డుమ్మాకొట్టిన సల్మాన్ ఖాన్

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి కోర్టుకు డుమ్మా కొట్టారు. సోమవారం ఆయన ముంబై సెషన్స్ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. దీంతో కేసు విచారణ ఏప్రిల్ 8కి వాయిదా పడింది. 2002లో తాగి డ్రైవ్ చేసి ఒకరి మృతికి కారణం అవ్వడంతో పాటు, నలుగురిని గాయ పరిచిన కేసులో సల్మాన్ విచారణ ఎదుర్కొంటున్నారు.

    సల్మాన్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని 304(2) కింద విచారణ జరుగుతోంది. ఈ సెక్షన్‌ కింద హత్యతో సమానం కాని శిక్షార్హ నరహత్య అభియోగాలతో విచారిస్తారు. దీనికింద దోషిగా తేలితే గరిష్ఠంగా పదేళ్ల శిక్ష పడుతుంది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 304(2) (శిక్షించ దగిన హత్యా నేరం) కింద విచారణ జరపాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను మేజిస్ట్రేట్ కోర్టు అంగీకరించింది.

    2002లో నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి, నలుగురు గాయపడటానికి కారణమైన సల్మాన్‌పై సెక్షన్ 304(1)(నిర్లక్ష్యపు డ్రైవింగ్) కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ సెక్షన్‌ కింద గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే, సెక్షన్ 304(2) కింద పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ల మార్పుతో మేజిస్ట్రేట్ ఈ కేసును విచారణ నిమిత్తం సెషన్స్ కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసులో సల్మాన్ కోర్టు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు.

    English summary
    Bollywood superstar Salman Khan failed to appear before the Mumbai Sessions Court on Monday, March 25, say media reports. Now, the Mumbai Sessions court postponed the hearing related to the enhancement of charges against the actor in 2002 hit and run case. Next hearing is scheduled on April 8.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X