యంగ్ హీరోకి హిట్ ల హ్యాట్రిక్ మిస్..ప్లాప్ ల హ్యాట్రిక్ యస్..
'హ్యాపీడేస్" చిత్రంతో కథానయుకుడిగా పరిచయం అయి ఆ చింత్రంతోనూ, రెండవ చిత్రం అయిన 'కొత్త బంగారు లోకం" చిత్రంతోనూ, రెండవ చిత్రం అయిన 'కొత్త బంగారు లోకం" చిత్రంతోనూ కథానయకుడిగానూ చెప్పుకోదగ్గ గుర్తింపును తెచ్చుకున్న కథానాయకుడు వరుణ్ సందేశ్. నటనలో ఏమంతగా రాణించకపోయినా ఆ సినిమాలలో విషయం ఉండడంతో లక్కీగా ఇతను కూడా పేరుతెచ్చుకోగలిగాడు.
ఇలా రెండు విజయవంతమైన చిత్రాల తర్వాత చేసిన చిత్రం ఎవరైనా ఎపుడైనా" తనకు హ్యాట్రిక్ ను ఇస్తుందనుకున్న సందేశ్ కు ఈ చిత్రం తీవ్ర నిరాశకరమైన ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత చేసిన కుర్రాడు, మరో చరిత్ర" చిత్రాలు కూడా ప్లాప్ అయి అతనికి ప్లాప్ హ్యాట్రిక్ ను ఇచ్చాను. అలా హిట్ ల హ్యాట్రిక్ వరుణ్ ను మిస్ అయినా ప్లాప్ హ్యాట్రిక్ మాత్రం యస్ అంటూ పలకరించింది. ఈ ప్లాప్ హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న తరువాత ఇతగాడు చేస్తున్న చిత్రం 'హ్యాపి హ్యాపీ"గా ఇందులో సంతోష్ అనే పాత్రలో నటిస్తున్నాడు. పేరుకు తగ్గట్లుగా అతనికి ఈ చిత్రం సంతోషాన్నిస్తుందో లేదో ఈ నెలలోనే తేలనుంది.


Click it and Unblock the Notifications











