ఎ.కె.47 తో హీరోకి స్వాగతం

సంజయ్ దత్ గతంలో ఎ.కె.47 తన వద్ద కలిగి ఉన్నాడని,1993 సీరియల్ ముంబయి ప్రేలుళ్ళలకు సంభంధం కలిగి ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కోవటం వారు ఈ రకంగా గుర్తు చేస్తున్నారు. అందుకోసం ఓ పెద్ద ఎ.కె.47 బొమ్మ ఒకటి చేయించి ..ఆ తుపాకి ని ముంబయి ప్రేలుళ్ళకు పాల్పడిన వారు ఉపయోగించారని క్రింద రాసారు. ఇలా చేసేరేంటి అని ATFL వారిని మీడియా వారు ప్రశ్నిస్తే...మా ప్రతిఘటన సంజయ్ దత్ పై కాదు..క్రిమినల్ చరిత్ర కల్గి ఉండి ఎన్నికల్లో నిలబడే వారిపై...ఎట్టి పరిస్ధితుల్లోనూ అలాంటి వారిని నిలబడనివ్వం అంటున్నారు.
అయితే సమాజవాద పార్టి వారు మాత్రం ఈ హోర్డింగ్స్ ని బి.ఎస్.పి.పార్టీ వారు కావాలని పెట్టారని అంటున్నారు. దానికి వివరణగా సమాజవాద పార్టీ స్టేట్ ప్రెసెడింట్ శివపాల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ..ఆ సంజయ్ దత్ కి వ్యతిరేకంగా పెట్టిన హోర్డింగ్స్ అన్ని ఇంతకుముందు ముఖ్యమంత్రి హోర్డింగ్ పెట్టిన ప్రైమ్ లొకేషన్స్ లో. అలాంటి చోట నుండి ముఖ్యమంత్రి హోర్డింగ్ తీసివేసి..వేరే వాళ్ళవి పెట్టాలంటే కేవలం రూలింగ్ పార్టీకే సాధ్యం అందుకే అది వారి పనే అంటున్నారు. అయితే అక్కడి స్ధానికులు మాత్రం సంజయ్ దత్ కే సపోర్టు చేస్తున్నారు. వారు దేశ విభజన జరిగినప్పుడు సంజయ్ తండ్రి సునీల్ దత్ ఇక్కడే ఓల్డ్ లక్నోలో కాపురం ఉండేవారని గుర్తు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











