అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’కు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, ఆ పాట కోసమే...
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటేనే అదిరిపోయే యాక్షన్స్ సీక్వెన్స్, ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసే డాన్స్ ఉంటుంది. మరి వాటిని పర్ఫెక్టుగా తెరపై రిఫ్లెక్ట్ చేయాలంటే సినిమాటోగ్రాఫర్ ఎంతో కీలకం. అందుకే ఈ విషయంలో నిర్మాతలు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. తాజాగా 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' సినిమాకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ కోసం హాలీవుడ్ నుండి సినిమాటోగ్రాఫర్‌ను హైర్ చేసుకున్నారట.

లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో
‘లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో' అనే పాట చిత్రీకరణ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ లబిసి పని చేశారు. సినిమాలో ఈ పాట ఎంతో స్పెషల్‌గా ఉంటుందని, అందుకే అతడిని హాలీవుడ్ నుండి హైర్ చేసుకున్నట్లు సమాచారం. ఇతడికి ఇంతకు ముందు హాలీవుడ్ చిత్రాలు, పాప్ సాంగ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ చిత్రీకరించిన అనుభవం ఉంది.

నా పేరు సూర్య
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఏప్రిల్ 22న మిలట్రీ మాధవరంలో ఆడియో
ఏప్రిల్ 22న మిలట్రీ మాధవరంలో ఆడియో ఫంక్షన్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ అంతా ఈ ఆడయో ఫంక్షన్ లో పాల్గొనబోతున్నారు. మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

అందుకే అక్కడ ఆడియో వేడుక
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడి పాత్ర కోసం ప్రత్యేకంగా తనను తాను మలచుకున్న విధానం ఔరా అనిపిస్తుంది. ఎందరో అమర వీరుల్ని తలచుకుంటూనే... ప్రతీ క్షణం మన రక్షణ కోసం... ప్రతీ ఇంటి నుంచి ఓ వీర సైనికుడిని దేశం కోసం త్యాగం చేసిన కుటుంబాల్ని ప్రత్యక్షంగా కలుసుకునేందుకు నా పేరు సూర్య చిత్రం ఆడియో ఫంక్షన్ మిలట్రీ మాధవరంలో చేయాలని నిర్ణయించినట్లు నిర్మాతలు తెలిపారు.

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - k.నాగబాబు
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ


Click it and Unblock the Notifications











