twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా పేరు సూర్య : హాలీవుడ్ డిఓపితో పాటు కాస్టూమ్ డిజైనర్ కూడా

    By Bojja Kumar
    |

    అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య' సినిమా హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ ల‌బిసి పని చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. జోసెఫ్ ల‌బిసి మాత్రమే కాదు, ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్స్‌కి కాష్ట్యూమ్స్ డిజైన్ చేసే యానమేరీ హొంగ్ కూడా పని చేస్తున్నారట. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక అపీషియల్ నోట్ విడుదల చేసింది.

    ప్రేక్ష‌కుల హృద‌యాలు దోచుకుంటున్న ల‌వ‌ర్ ఆల్‌సో.. ఫైట‌ర్ ఆల్‌సో.. సాంగ్ ఇటీవ‌లే అమెరికా లో షూట్ చేయ‌టం జ‌రిగింది. ఈ సాంగ్ ని ప్ర‌ముఖ డి.ఓ.పి జొసెఫ్ ల‌బిసి షూట్ చేశారు. ఆయన హాలీవుడ్ చిత్రాలు ద మూవీ హీరో, ది రీపెర్స్‌ లాంటి సినిమాలతో పాటు సింగర్స్ అరియాణ గ్రాండే, ఎనరిక్యూ ఇగ్లిసియ్స్, నిక్కిమినాజ్ వంటి వారితో వర్క్ చేశారు. దాదాపు 40కి పైగా ఇంగ్లీష్ పాప్ అల్బమ్స్ కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు అని నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలిపారు.

    Hollywood costume designer Ann Marie Hoang for Naa Peru Surya song

    ఈ సాంగ్ షూట్ కొసం దాదాపు 20 రోజులకి పైగా అమెరికాలోని హాలీవుడ్ ప్రాంతంలో లొకేష‌న్స్ రీసెర్చ్ చేశాం. జోసెఫ్ అందించిన విజువల్స్ ప్రేక్షకుల ఆకట్టుకుంటాయి. ఈసాంగ్ కి మ‌రో హై ప్రోఫైల్ టెక్నిషియ‌న్ వ‌ర్క్ చేశారు. ప్ర‌ముఖ కాస్ట్యూమ్ డిజైన‌ర్ ఆన్‌ మెరీ హూంగ్ ఈ సాంగ్‌కి ప‌నిచేశారు. ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్స్‌ ఎందరికో కాష్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు యానమేరీ హొంగ్, ప్రపంచ ప్రఖ్యాత పాప్ క్వీన్ జెన్నీఫర్ లోపేజ్, నిక్కీ మినాజ్ తదితర సింగర్స్‌కి కాష్ట్యూమ్స్ అందిస్తున్నారు యాన్. ఇలాంటి వరల్డ్ గ్రేడ్ టెక్సీషియన్స్ తమ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉందని లగడపాటి శ్రీధర్ తెలిపారు.

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ నెల 22న మిల‌ట‌రి మాధ‌వ‌రంలో ఆడియో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ 29‌న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి మే 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‍‌గా రిలీజ్ చేస్తున్నారు.

    English summary
    Hollywood Cinematographer Joseph Labisi Provided Cinematography For A Song In Stylish Star Allu Arjun’s Naa Peru Surya. Another high-profile technician has worked for the song. The famous costume designer Ann Marie Hoang who designed costumes for many Hollywood pop singers like Jennifer Lopez has worked specially for this song. Ann Marie Hoang has also designed costumes for the popular pop singer Nicki Minaj. Producer Lagadapati Sridhar expressed his happiness for working with such high-profile technicians for the song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X