HCA Awards: ఎన్టీఆర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. దెబ్బకు దిగొచ్చిన హాలీవుడ్.. అందుకే తీసుకోలేదంటూ!
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినా.. ప్రపంచం దృష్టిని ఆకర్షించి.. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీ ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అలాగే, ఆస్కార్‌కు సైతం నామినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇటీవలే RRR మూవీ హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ అవార్డులను సైతం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ గురించి ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

అలా వచ్చేసిన RRR సినిమా
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఈ క్రేజీ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు.

అవార్డుల వర్షం... ఆస్కార్‌కూ
విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న RRR.. వరల్డ్ వైడ్‌గా అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా ప్రభావాన్ని చూపించి ఇప్పటికే ఎన్నో కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ సహా ప్రతిష్టాత్మక అవార్డులనూ గెలిచింది. అంతేకాదు, ఆస్కార్‌కు కూడా ఓ విభాగంలో నామినేట్ అయింది.

నాలుగు అవార్డులు సొంతం
ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) నామినేషన్స్‌ను ప్రకటించింది. ఇందులో ఐదు విభాగాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ నామినేట్ అయింది. ఇక, రెండు రోజుల క్రితమే కాలిఫోర్నియాలో ఈ అవార్డులు అందించారు. ఇందులో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో RRR అవార్డులు పొందింది.

తారక్ లేకపోవడంతో నిరాశ
హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) అవార్డుల కార్యక్రమానికి RRR యూనిట్ సభ్యులంతా వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మాత్రం మిస్ అయ్యాడు. దీనికి కారణం.. ఇటీవలే అతడి సోదరుడు తారకరత్న మరణించడమే అని తెలిసింది. దీనివల్లే ఆహ్వానం ఉన్నా ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌కు హాజరు కాలేదు. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు ధృవీకరించారు.

చరణ్ ఫోకస్.. ఫ్యాన్స్ వార్
హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) కార్యక్రమంలో RRR మూవీకి ఓ అవార్డు ప్రకటించిన సమయంలో రామ్ చరణ్ స్టేజ్ పైకి వెళ్లి దాన్ని అందుకున్నాడు. దీంతో అతడికే ఈ అవార్డు వచ్చిందని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో అది మూవీ మొత్తానికి వచ్చిన అవార్డు అంటూ ఖండిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది.
అతడికే వచ్చిందా అంటూ
రెండు రోజుల క్రితమే ప్రకటించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా అవార్డు వచ్చిందా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమిటీ సభ్యులను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో HCA నేరుగా స్పందించి దీనిపై క్లారిటీ ఇచ్చేసింది.

ఎన్టీఆర్‌కు కూడా అవార్డు
తాజాగా HCA సంస్థ ట్విట్టర్ ఖాతాలో 'డియర్ RRR ఫ్యాన్స్ అండ్ సపోర్టర్స్.. మేము హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ అవార్డుల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించాము. కానీ, ఆయన ఇండియాలో సినిమా షూటింగ్ వల్ల హాజరు కాలేదు. కానీ, త్వరలోనే తన అవార్డును అందుకుంటాడు. మీ ప్రేమకు ధన్యవాదాలు.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్' అని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











