twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క 'అరుంధతి' క్రేజ్ ని క్యాష్ ...

    By Srikanya
    |

    అనుష్క హీరోయిన్ గా చేసిన అరుంధతి చిత్రం సూపర్ హిట్ క్రేజ్ క్యాష్ చేసుకోవటానికి '1408 అరుంధతి బంగ్లా' అనే టైటిల్ తో ఓ చిత్రం రాబోతోంది. హాలీవుడ్ హిట్ హారర్‌ ఫిల్మ్‌ '1408' కిది డబ్బింగ్. ఈ చిత్రం టైటిల్ కి అరుంధతి బంగ్లా అని కలిపి వదులుతున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మి వెంకటసాయి ఫిలిమ్స్‌ పతాకంపై ముత్యాల రాందాస్‌ తెలుగుకు డబ్ చేసి అందిస్తున్నారు.

    ఇక ఈ చిత్రంలో '2012 యుగాంతం'లో హీరోగా నటించిన జాన్‌ కుజాక్‌ ఈ సినిమాలోనూ హీరోగా చేసారు. అలాగే హాలీవుడ్‌ స్టార్ ఆర్టిస్టు శామ్యూల్‌ ఎల్‌.జాక్సన్‌ మరో ప్రధాన పాత్ర ధరించాడు. ఇక ఈ చిత్రం కథ ఈ రకంగా సాగుతుంది. మైక్‌ పాపులర్ హారర్‌ నవలా రచయిత. దెయ్యాల భవంతులుగా ప్రజల్లో పేరుండే భవనాల్లో పరిశోధనలు చేస్తూంటాడు. అతనికి హోటల్ రూమ్‌ నెం.1408 గురించి అలాంటి సమాచారమే తెలుస్తుంది. దాంతో ఆ రూమ్‌ లో ఒక రాత్రి గడపాలని వెళ్లిన అతనికి రకరకాల భయానక అనుభవాలు ఎదురవుతాయి.

    ఈ చిత్రం స్టీఫెన్‌ కింగ్‌ రాసిన కథ ఆధారంగా రూపొందింది. 'డ్రౌనింగ్‌ ఘోస్ట్‌' వంటి గొప్ప హారర్‌ సినిమాని రూపొందించిన స్వీడిష్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ హాఫ్‌స్ట్రామ్‌ దర్శకత్వం చేసారు. 120 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్ఠాత్మక ఎం.జి.ఎం.(మెట్రో గోల్డ్‌విన్‌ మేయర్‌), డైమెన్షన్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఇప్పటివరకు 640 కోట్ల రూపాయల్ని ఆర్జించింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X