మగధీరలో ఆ హాలీవుడ్...
రామ్ చరణ్ తేజ, రాజమౌళి కాంబినేషన్లో రెడీ అవుతున్న మగధీర చిత్రంలో హాలీవుడ్ హిట్ '300' చిత్రాన్ని పోలిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని వినపడుతోంది. గతంలోనూ ట్రాయ్ చిత్రంలోని కొన్నిసన్నివేశాలను అనుకరిస్తూ విక్రమార్కుడులో విలన్ ఎపిసోడ్ డిజైన్ చేసిన రాజమౌళి ఈ చిత్రంలో '300'ని ఎడాప్ట్ చేసారంటున్నారు. అందుకు తగ్గట్లు గానే బయిటకు లీకైన స్టిల్స్, వీడియోస్ సైతం ఉండటంతో కొందరు కన్ఫర్మ్ చేస్తున్నారు.
అలాగే గ్లాడియోటర్,బ్రేవ్ హార్ట్ చిత్రాలలోని కొన్ని హైలెట్స్ కూడా ఈ మగధీర ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనపడే అవకాశం ఉందంటున్నారు.అందుకే ఈ చిత్రం లో గ్రాఫిక్ వర్క్ పెరిగి రిలీజ్ లేటవుతుందోని తెలుస్తోంది. చిత్రంలో చాలా భాగం బ్లూ మ్యాట్ పై చిత్రీకరించారు. ఇక 300 చిత్రం మొత్తం గ్రాఫిక్స్ మయమే. నాలుగు వందల ఏళ్ళ క్రితం జరిగే కథలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో ఈ ఎపిసోడ్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ నటిస్తోంది. ఆమె ఫ్లాష్ బ్యాక్ లో రాకుమారిగానూ, ఇప్పుడు జరిగే కథలో ఫ్యాషన్ డిజైనర్ గానూ కనిపిస్తుంది. ఇక శ్రీహరి సైతం ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. షేర్ ఖాన్ పేరుతో సాగే ఈ పాత్ర ఈ చిత్రం హైలెట్స్ ఒకటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











