హాలీవుడ్ అద్బుతం 'అవతార్' నేడే
టైటానిక్ వంటి సెల్యులాయిడ్ అధ్బుతం రూపొందించిన జేమ్స్ కామరూన్ తాజా చిత్రం అవతార్ ఈ రోజే ప్రపంచమంతటా రిలీజ్ అవుతోంది. 1994వోనే జేమ్స్ కెమరాన్ అవతార్ కి సంభందించి 80 పేజీల స్క్రిప్టు రాసుకున్నారు. శామ్ వర్తింగ్టన్, మెచ్చల్లీ రోడ్రిగ్యూజ్, జో సల్ధానా వంటి ఆరుగురు స్టార్స్ తో ఈ చిత్రానికి 100 మిలియన్ కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అప్పట్లో ఆయన చెప్పారు. సైన్స్ ఫిక్షన్ అవటంతో ఈ చిత్రానికి భారీ గ్రాఫిక్స్ అవసరమని పేర్కొన్నారు...ఆ రకంగానే ప్లాన్ చేసారు. అయితే సినిమా పూర్తయ్యేసరికి 300 మిలియన్ డాలర్లుకు పైగా బడ్జెట్ అవుతుందని తెలుసుకుని అవతార్ ఆపేసారు. ఆ తర్వాత వనరలు సమకూర్చుకుని ఈ చిత్రం పూర్తి చేసారు. 60 శాతం కంప్యూటర్ మాయాజాలం,40 శాతం లైవ్ యాక్షన్ ల సమాహారంతో రూపొందిన చిత్రం అవతార్. చిత్రాన్ని ట్వంటియత్ ఫాక్స్ సెంచరీ సంస్ధ పంపిణీ చేస్తోంది. నెట్ లో ఈ చిత్రం ట్రైలర్స్ విడుదలైన కాస్సేపటికే కోటి క్లిక్కులు పడ్డాయంటేనే ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ఈ చిత్రంలో ఓ పేరొందిన ఆర్మీ ఆఫీసర్ ఓ ఘోర ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ఆ ప్రమాదం కారణంగా అతని నడుమ భాగం నుంచి శరీరం పూర్తిగా చచ్చుపడిపోతుంది. ఈ నేపధ్యంలో అవతార్ అనే కార్యక్రమంలో పాల్గొంటే పూర్వంలో నడవొచ్చనే ఆశతో ఆ వ్యక్తి అందులో పాల్గొంటాడు. అక్కడే ట్విస్ట్ పడుతుంది. అవతార్ లో భాగంగా వేరే గ్రహానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ గ్రహంలో లభించే విలువైన ఖనిజాలను దక్కించుకోవాలన్నది మిలటరీ ఫోర్స్ ఆకాంక్ష. ఆ గ్రహంలోకి అడుగుపెట్టే మానవులు శ్వాస తీసుకోలేదు. ఇవి శ్వాస తీసుకోగలవు కానీ వాటిని మరొకరు నియంత్రించాల్సి ఉంటుంది. ప్రమాదానికి గురైన ఆర్మీ ఆఫీసర్ పోలిన అవతారన్ని తయారు చేసి ఆ గ్రహంలోకి పంపుతారు. తనని పోలిన అవతారం కాబట్టి దాన్ని నియంత్రించే శక్తి ఆర్మీ ఆపీసర్ చేతిలోనే ఉంటుంది. చచ్చుబడిన శరీరానికి పూర్వపు శక్తి లభిస్తుందనుకుని అవతార్ కార్యక్రమలో పాల్గొనే ఆర్మీ ఆఫీసర్ కి మిలటరీ వాళ్ళు తనని పావులా వాడుకుంటున్నారనే సంగతి తెలియదు. అలా ఆ కథనం ఆసక్తిగా సాగుతుంది.


Click it and Unblock the Notifications











