దేశీగర్ల్‌గా కనిపించబోతున్న ఫ్రిదా
స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన భారతీయభామ ఫ్రిదా పింటో....ఆ సినిమా తర్వాత ఇండియన్ సినిమాల్లో నటించబోను అంటూ హాలీవుడ్ చెక్కేసిన విషయం తెలిసిందే. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. తాను భారతీయ సినిమాల్లో నటించబోనని చెప్పినా...భారతీయ భామగా(దేశీ గర్ల్)గా నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అది బాలీవుడ్ సినిమా మాత్రం కాదు.
హాలీవుడ్ దర్శకుడు మైఖేల్ వింటర్ బాటమ్ రూపొందిస్తున్న 'త్రిష్ణా" సినిమాలో ఫ్రిదా ఆటో రిక్షా డ్రైవర్‌గా కనిపించ బోతోంది. ఇందులో ఆమె ఓ ధనవంతుడి కొడుకు ప్రేమలో పడే క్యారెక్టర్ పోషిస్తోంది. ఆధునిక కాలంలో ఇండియా ఎలా ఉంది అనే కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నారు. థామస్ హార్డీ నవల 'టెస్ ఆఫ్ ది డి" ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
freida pinto michael winterbottom trishna thomas hardy ఫ్రిదా పింటో స్లమ్ డాగ్ మిలియనీర్ త్రిష్ణా మైఖేల్ వింటర్ బాటమ్


Click it and Unblock the Notifications