జై లవకుశ వివాదం.. ఎన్టీయార్.. కల్యాణ్ రాం గురించి.. నోరు విప్పిన హాలీవుడ్ మేకప్‌మ్యాన్..

By Rajababu

Recommended Video

జై లవకుశ వివాదం.. నోరు విప్పిన హాలీవుడ్ మేకప్‌మ్యాన్..!

ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జైలవకుశ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. అయితే అందులో కీలకమైన జై పాత్ర రూపురేఖలను విభిన్నంగా తీర్చి దిద్దడం కోసం హాలీవుడ్ నుంచి వాన్స్ హార్ట్‌వెల్‌ను రప్పించారు. తొలుత విలన్ షేడ్స్ ఉండే జై పాత్ర కోసం వికృతంగా ఉండే విధంగా మేకప్ వేసి కొన్ని స్టిల్స్ లీక్ చేశారు. అయితే తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అలాంటి మేకప్ అసలు కనిపించకపోవడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించింది.

ఎన్టీఆర్‌కు కొత్త లుక్

ఎన్టీఆర్‌కు కొత్త లుక్

మేకప్‌మ్యాన్ వాన్స్ హార్ట్‌వెల్ అద్భుతంగా ఎన్టీఆర్‌ను కొత్తలుక్‌లో తీర్చిదిద్దాడట. అయితే అతను చేసిన మేకప్‌ను వాడుకోలేదని, అతడిని మధ్యలోనే పంపించారు అని ఓ రూమర్ ఫిలింనగర్‌లో షికారు చేసింది.

రెమ్యునరేషన్ ఇవ్వలేదు

రెమ్యునరేషన్ ఇవ్వలేదు

అంతేకాకుండా వాన్స్ హార్ట్‌వెల్‌కు సరిగా పారితోషికం కూడా ఇవ్వలేదు. సినిమాకు కష్టపడినందుకు తగిన ప్రతిఫలం దక్కలేదు అనే వార్తలు బయట వినిపించాయి. అయితే మీడియాలో పెద్దగా బయటకు రాలేదు.

హర్ట్‌వెల్ స్పందన

హర్ట్‌వెల్ స్పందన

జై లవకుశ సినిమా రిలీజ్ అయి ఘనవిజయం సాధించడం, జై పాత్రకు మంచి పేరు రావడంతో ఈ రూమర్లను పట్టించుకోలేదు. తాజాగా ఈ రూమర్‌పై హాలీవుడ్ టెక్నిషియన్ స్పందించనట్టు మీడియాలో వార్త ఒకటి ప్రచారం జరుగుతున్నది.

 కల్యాణ్‌రాం మంచిగా..

కల్యాణ్‌రాం మంచిగా..

హార్ట్‌వెల్ తాజాగా స్పందించినట్టు వస్తున్న వార్త ప్రకారం.. జైలవకుశ కోసం కష్టపడింది నిజమే. ఇప్పుడు కూడా వారితో నేను టచ్‌లోనే ఉన్నాను. నిర్మాత కల్యాణ్ రామ్, ఇతర కీలక యూనిట్ సభ్యులు నన్ను బాగా చూసుకొన్నారు. వారి వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు అని అన్నారు.

రెమ్యునరేషన్ బాగానే

రెమ్యునరేషన్ బాగానే

ఇక నా రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి వివాదం లేదు. నిర్మాత కల్యాణ్ రాం నాకు ఇవ్వవల్సిన రెమ్యునరేషన్ మొత్తం నాకు ఎలాంటి జాప్యం లేకుండా ఇచ్చారు. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అని హార్ట్‌వెల్ పేర్కొన్నారు.

రికార్డు కలెక్షన్లు

రికార్డు కలెక్షన్లు

ఇక జై లవకుశ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల గురించి ప్రస్తావించే.. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X