Hollywood Movies releases in August.. థియేటర్లలో హంగామా.. ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అంటే..
కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమ కుదేల్ అయిపోయింది. భారీ చిత్రాలన్నీ విడుదలకు నోచుకోలేక ల్యాబ్‌లోనే మూలిగిపోతున్నాయి. రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందించిన హాలీవుడ్ చిత్రాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. థియేటర్లు మూతపడటంతో పలు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.
అయితే ప్రస్తుతం ఇండియాలో కరోనావైరస్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో హాలీవుడ్ చిత్రాలు రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా థియటర్లలో సినిమాలు రిలీజ్ అయ్యేందుకు ప్లాన్ చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకొంటున్నారు.

సెకండ్ వేవ్‌కు ముందు
కరోనా సెకండ్ వేవ్‌కు ముందు కొన్ని చిత్రాలు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో హాలీవుడ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. గాడ్జిల్లా వర్సెస్కాంగ్, టెనెట్, వండర్ ఉమెన్ 1984 లాంటి చిత్రాలు రిలీజై ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. అయితే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న చిత్రాలు కూడా మళ్లీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తాయా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సినిమాలు
ఆగస్టు నెలలో భారీ సంఖ్యలో హాలీవుడ్ చిత్రాలు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ది కంజ్యూరింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్, ది సూసైడ్ స్కాడ్, ఫాస్ట్ 9, ఓల్డ్, మోర్టల్ కంబాట్, ప్రామిసింగ్ యంగ్ ఉమెన్, నోబడీ, ది ఫరెవర్ పర్జ్ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.

ది కంజ్యూరింగ్ 3 మూవీ
ది కంజ్యూరింగ్ సిరీస్‌లో మూడో చిత్రం ఇండియాలో ఆగస్టు 13వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఇంతకు ముందు ఈ సీరిస్‌లో రెండు చిత్రాలు విడుదలై మంచి రెస్సాన్‌ను సొంతం చేసుకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నది.

సూసైడ్ స్క్వాడ్ రిలీజ్
ఇక సూసైడ్ స్క్వాడ్ చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టులోనే రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమాను ఇదే తేదీకి రిలీజ్ చేస్తున్నారు.

నైట్ శ్యామలన్ చిత్రం కూడా ఆగస్టులో
ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫాస్ట్ 9 కూడా ఆగస్టులో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. విన్ డీజిల్, జాన్ సీనా నటించిన ఈ చిత్రం ఆగస్టులోనే విడుదల కానున్నది. అలాగే ఎన్నారై ఫిలిం మేకర్ ఎం నైట్ శ్యామలన్ రూపొందించిన చిత్రం ఓల్డ్ చిత్రం ఆగస్టులోనే రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. సైంటిఫిక్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కావడానికి అవుతున్నది.
Recommended Video

ముంచుకొస్తున్న థర్డ్ వేవ్
మిస్టర్ నోబడి, ది ఫరెవర్ పర్జ్ చిత్రాలు దేశవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మిస్టర్ నోబడి ఆగస్టు 17వ తేదీన, సెప్టెంబర్ 17వ తేదీన ది ఫరెవర్ పర్జ్ విడుదల కానున్నాయి. ఇంకా మరికొన్ని చిత్రాలు కూడా విడుదలకు ముస్తాబువుతున్నాయి. అయితే థర్డ్ వేవ్ ముంచుకొస్తున్నందనే వార్తల నేపథ్యంలో హాలీవుడ్ చిత్రాలను రిలీజ్ చేయడంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలను రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారా? రాకపోతే నష్టాల్లో మునిగిపోవాల్సిందేనా అనే మీమాంసలో సినీ ప్రముఖులు ఉన్నారు. ఏది ఏమైనా హాలీవుడ్ చిత్రాలు రిలీజ్ అవుతాయా? లేక పరిస్థితులు బాగా లేకపోతే ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











