చిరు చేసిన సినిమాకు 500 కోట్లు ఆఫర్
చిరంజీవి రీమేక్ చేసిన శంకర్ దాదా ఎంబిబియస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల ఒరిజినల్ మున్నాభాయ్ చిత్రాల ప్రాఛైంజీల మొత్తానికి ఓ హాలీవుడ్ కంపెనీ నుండి 500 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది. భవిష్యత్ లో మున్నాభాయ్ క్యారెక్టర్ తో సినిమాలు తీసుకోవటానికి, మున్నా బాయ్ కామిక్స్ విడుదల చేయటానికి మొత్తం కలిపి ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చినట్లు సమాచారం.ఈ విషయాన్ని విధువినోద్ చోప్రా ఫిల్మ్ సి.ఇ.ఓ సమీరా రావు కన్ఫర్మ్ చేసారు. అయితే ఏ సంస్ధ అన్నది మాత్రం పేరు చెప్పటానికి ఇష్టపడలేదు. ఇక త్వరలో ఈ సంస్ధవారు మున్నాభాయ్ 3 ని చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఇలాంటి ప్రతిపాదనలపై ఆసక్తి లేదని అన్నారు.
ఇక ప్రస్తుతం సంజయ్‌దత్ విలన్‌గా 'అగ్నిపధ్" చిత్రం చేస్తున్నారు. 1990లో అమితాబ్ హీరోగా, డాని డెంజోపా విలన్ గా నటించిన చిత్రం 'అగ్నిపధ్"కి ఇది రిమేక్. ఇందులో సంజయ్‌దత్ 'కంచా చీనా" పాత్ర చేస్తున్నాడు. ఇందులో విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ ని చూస్తేనే విలన్‌కి కూడా వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నాడు. విలన్ గా కనపడేందుకు సంజయ్ తలనీలాలు సమర్పించుకోవడమే కాక, చెవి పోగు కూడా పెట్టుకున్నారు. సినిమాలో చాలావరకు నలుపు రంగు దుస్తుల్లోనే కనిపిస్తారట.'లగే రహో మున్నాభాయ్" చిత్రంలో గాంధీగిరిని ఫాలో అయిన సంజయ్‌దత్ ఈ చిత్రంలో దాదాగిరి చేస్తున్నారని, ఆయన లుక్ డిఫరెంట్‌గా ఉంటుందని విన్నవారు ఈ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని గత కొంత కాలంగా ఆసక్తిగా ఎదురు చూశారు.లేటెస్ట్ గా సంజయ్ పుట్టినరోజు సందర్భంగా 'అగ్నిపథ్"లోని ఆయన లుక్‌కి సంబంధించిన ఫొటోని విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











