'త్రీ ఇడియట్స్' హాలీవుడ్ రీమేక్.. డిటేల్స్
అమీర్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం త్రీ ఇడియట్స్ ఇప్పుడు హాలీవుడ్ లోకి సైతం రీమేక్ కానుంది. ఈ విషయమై నిర్మాత విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ...హాలీవుడ్ కి చెందిన మూడు కంపెనీలతో టాక్స్ జరిగాయి. అయితే ఇటలీకి చెందిన ఓ కంపెనీ ఈ రైట్స్ ని తీసుకోబోతోంది అన్నారు. అలాగే చైనాలో సైతం తొమ్మిది వందల ప్రింట్స్ తో ఈ చిత్రం విడుదల అవుతోంది. వచ్చే వారమే అక్కడ ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ విషయమై చెప్తూ..భారతదేశంలో ఓ చిత్రం చైనాలో ఇన్ని ప్రింట్స్ తో రిలీజ్ కావటం ఇదే మొదటిసారి.
అంతేగాక తైవాన్ లో ఈ చిత్రాన్ని స్టేజి మ్యూజికల్ గా ఎడాప్ట్ చేసారు. హాంకాంగ్ లో ఇప్పటికే ఈ చిత్రం విడుదలై మూడు మిలయన్ల డాలర్లు వసూలు చేసింది అన్నారు. చైనాలో కుంగు ఫూ హజిల్ దర్శకుడు స్టెఫిన్ చో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి యూనివర్శిల్ వ్యాల్యూస్ ఉండటం వల్లే ఇది సాధ్యమైంది అన్నారు. అలాగే ఈ చిత్రం తమిళ,తెలుగు రీమేక్ లని ప్రముఖ దర్శకుడు శంకర్ చేస్తున్నారు. ఇలియానా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. విజయ్ కీ రోల్ ని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











