వీడియో : నితిన్ 'పెద్దపులి' పాటని హాలీవుడ్ సింగర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూశారా !
Recommended Video

నితిన్ 'పెద్దపులి' పాటని హాలీవుడ్ సింగర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూశారా !
హీరో నితిన్ నటించిన ఛల్ మోహన్ రంగ చిత్రం ఏప్రిల్ 5 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఛల్ మోహన్ రంగ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. సంగీత దర్శకుడు తమన్ తన సూపర్ ఫామ్ ని కొనసాగిస్తూ ఛల్ మోహన్ రంగ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ అందించాడు.
ఈ చిత్రంలో ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యాయి. మూడు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పెద్దపులి సాంగ్ అయితే యువతని తెగ ఆకర్షిస్తోంది. నితిన్ పెద్ద పులి సాంగ్ కు ప్రముఖ హాలీవుడ్ సింగర్ ఎకాన్ కూడా ఫిదా అయ్యాడు. ఎకాన్ పెద్దపులి సాంగ్ ని ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. సాంగ్ ని ఎంజాయ్ చేయడమే కాదు.. ఛల్ మోహన్ రంగ చిత్రానికి శుభాకాంక్షలు తెలియజేసాడు కూడా.


Click it and Unblock the Notifications











