అల్లు అర్జున్ మూవీ హాలీవుడ్ ఫైట్ మాస్టర్‌కి రూ. 2 కోట్లు
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హీరో ఇంట్రడక్షన్‌కి సంబంధించిన యాక్షన్ దృశ్యాలను అక్కడ చిత్రీకరించారు. భారీ ఎత్తున సాగే ఈ యాక్షన్ విన్యాసాలను హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసారు.
థాయ్‌లాండ్‌కి చెందిన కెచే కంపక్డీ థాయ్ మార్షల్ ఆర్ట్స్ లో ఎక్సపర్ట్. ఇది వరకు ఆయన బ్లడ్ స్పోర్ట్ 2, ఓన్గ్ బాక్ 2తో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు పని చేసాడు. ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసాడట కెచె. ఇందుకుగాను అతనికి నిర్మాత బండ్ల గణేష్ రూ. 2 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చాడని టాక్.
కెచే కంపక్డీ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.... 'కేచ మాస్టార్ ఫైట్స్ అద్భుతంగా కంపోజ్ చేసాడు, అతని పనితనం ఏమిటో సినిమాలో చూడండి' అంటూ వెల్లడించారు. అల్లు అర్జున్ వ్యాఖ్యాలు సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగేలా చేసింది. 'ఇద్దరమ్మాయిలతో' సినిమా కోసం అల్లు అర్జున్ కండలు బాగానే పెంచాడు. ఈ సినిమాలో మరి 'ఇద్దరమ్మాయిలతో' ప్రేమలో పడాలి కాబట్టి, వాళ్లని ఆకర్షిచాలంటే, మరి కండలు తిరిగిన బాడీ వుండాలి కదా ! అందుకే, అందుకు తగ్గట్టుగానే ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు.
ఇందులో అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. పూరి చిత్రం గురించి చెబుతూ ''ఇదో ప్రేమ కథా చిత్రం. బన్నీ అంటేనే ఎనర్జీ. తనే కాదు సెట్‌లో అందర్నీ ఉత్సాహంగా ఉరకలేయిస్తారు. ఈ కథను అల్లు అరవింద్‌కు చెప్పినపుడు మావాడికి బాగుంటుందని చెప్పారు. తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో. ఈ సినిమా కథను బన్నీకి చెప్పినప్పుడు.. మనమే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత అరవింద్‌గార్ని కలిసినప్పుడు 'బన్నీకి ఒక కథ చెప్పావట.. అది తనతోనే చెయ్యి. తనకు బాగా నచ్చింది' అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications











