చిరంజీవి కోసం రంగంలోకి దిగిన హాలీవుడ్ స్టంట్ మాన్.. సురేందర్ రెడ్డితో ఫోజు అదిరింది!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి షూటిం శరవేగంగా జరుగుతోంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చిత్రం రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఈ తరహా పాత్రలో నటించడం ఇదే తొలిసారి. దీనితో సైరా చిత్రం గురించి సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర విషయం తెలియజేశాడు.

యాక్షన్ సీన్స్ షూటింగ్
సైరా చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. బలమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు. 19వ శతాబ్ద కాలానికి సంబందించిన చరిత్ర కనుక అప్పటి పరిస్థితులకు అనుగుణంగా యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు.

హాలీవుడ్ స్టంట్ మాన్
సైరా చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ మాన్ గ్రెగ్ పావెల్ రంగంలోకి దిగాడు. ఈ విషయాన్నీ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. బ్రహ్మాజీ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సురేందర్ రెడ్డితో ఫోజు
హాలీవుడ్ స్టంట్ మాన్ గ్రెగ్ పావెల్, సురేందర్ రెడ్డితో చుట్ట కాలుస్తూ ఇచ్చిన ఫోజు అదిరేలా ఉంది. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్రహ్మజీ.. సైరా యాక్షన్ మొదలైనట్లు తెలిపాడు.

బ్లాక్ బస్టర్ హాలీవుడ్ చిత్రాలకు
గ్రెగ్ పావెల్ ప్రముఖుల హాలీవుడ్ చిత్రాలన్నింటికీ స్టంట్ మాన్ గా పనిచేశాడు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6, హ్యారీపోర్టర్, స్కై ఫాల్ వంటి అద్భుత చిత్రాలకు స్టంట్ డైరెక్టర్ గా పని చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











