జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’కు హాలీవుడ్ వాళ్లెందుకంటే..?
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'బాద్ షా' చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారనే విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో దర్శక నిర్మాతలు బిజీబిజీగా ఉన్నారు. వీరి తీసుకోవడానికి ఓ ప్రధాన కారణం ఉంది.
ఈచిత్ర షూటింగులో భాగంగా ఇటలీ, నేపాల్‌లలో భారీ చేజింగ్ సీన్లు చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం హాలీవుడ్ చిత్రాలు 'టాన్స్ ఫార్మర్స్', 'హిట్ మ్యాన్' లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషియన్స్‌ను తీసుకుంటున్నారు. ఈ సీన్లలో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జోడిస్తున్నారు.
క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈచిత్రాన్ని నిర్మించాలని, తన గత సినిమా 'దూకుడు' చిత్రం గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో దాన్ని మించి సినిమా తీయాలనే ఆలోచనలో జూ ఎన్టీఆర్‌తో 'బాద్ షా'ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు దర్శుకుడు శ్రీను వైట్ల.
అదే విధంగా ఈచిత్రంలో కడుపుబ్బా నవ్వుకునే కామెడీ సీన్లు, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, ఆకట్టుకునే కథాంశం ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. గత చిత్రాలకంటే భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్ చాలా ఎనర్జీగా దర్శనం ఇవ్వబోతున్నాడు.
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సింగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











