భరత్ అనే నేను: అంచనాలు పెంచుతున్న హోలీ ఫైట్
దర్శకుడు కొరటాల శివ "భరత్ అనే నేను" కోసం హోలీ నేపథ్యంలో భారీ ఫైట్‌ను చిత్రీకరించారట, ఈ ఫైట్ సినిమాకే హైలైట్ అవుతుందంటోంది చిత్ర యూనిట్..
అగ్రహీరోల సినిమా అనగానే కమర్షియల్ ఎలిమెంట్స అనేవి చాలా కీలకం, ఇక మహేష్ బాబు లాంటి హీరో ఉన్న సినిమా అంటే పూర్తి క్లాస్ టైప్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయరు. అందులోనూ బ్రహ్మోత్సవం లాంటి మెగా డిజాస్తర్ తర్వాత స్పైడర్ తో అయినా ఆలోటు తీరి పోతుందీ అంటే ఆఖరికి మురుగదాస్ కూడా సరైన హిట్ ఇవ్వలేక పోయాడు. ఇక ఈ సారి తీయబోతున్న సినిమాతో అయినా ఆ మచ్చని చెరిపేసుకోవాలనుకుంటున్నాడు.. అందుకే సరైన మాస్ ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట..

భారీ యాక్షన్ ఎపిసోడ్స్
రాబోయే 'భరత్ అనే నేను' చిత్రంలో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట...క్లాసీగా కనిపించే మహేశ్ బాబు ఆన్ స్క్రీన్‌పై మాస్ సీన్స్ లోనూ అదరగొడుతుంటాడు... అందుకేనేమో మహేశ్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతుంటారు దర్శకులు...

చాలానే ఎక్స్పెక్టేషన్స్
చాలానే ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న 'భరత్ అనే నేను' సినిమాలో కూడా యాక్షన్ సీన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ... ఇటీవల ఈ చిత్రం కోసం హోలీ నేపథ్యంలో భారీ ఫైట్‌ను చిత్రీకరించారట... ఈ ఫైట్ సినిమాకే హైలైట్ అవుతుందంటోంది చిత్ర యూనిట్..

కొత్త షెడ్యూల్ ఈనెల 26 నుంచి
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న 'భరత్ అనే నేను' కొత్త షెడ్యూల్ ఈనెల 26 నుంచి మొదలుపెట్టనున్నారు.. ప్రస్తుతం మహేశ్ థమ్స్ అప్ యాడ్ షూటింగ్ కోసం హాలీవుడ్ వెళ్లాడు... అక్కడి నుంచి రాగానే మిగిలిన భాగం షూట్‌లో పాల్గొంటాడట... డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మహేశ్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు.

వచ్చే యేడాది ఏప్రిల్ 27న
బాలీవుడ్ భామ కైరా అద్వాని ప్రిన్స్ కు జోడీగా నటిస్తోంది... మహేశ్-కొరటాల 'శ్రీమంతుడు' సినిమాకి పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికీ సంగీతాన్నందిస్తున్నాడు... సమ్మర్ స్పెషల్‌గా వచ్చే యేడాది ఏప్రిల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' వంటి పరాజయాల తర్వాత వస్తున్న ఈ చిత్రం మహేశ్‌కు ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి...


Click it and Unblock the Notifications











