‘భరత్ అనే నేను’లో హోలీ ఫైట్ యాడ్ చేస్తున్నారు!

By Bojja Kumar

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం బాక్సాపీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తొలి వారం రోజుల్లోనే రూ. 161 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అందుకునే దిశగా పరుగులు పెడుతోంది.

సినిమాలోని ప్రతీ సీను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు కొరటాల. అయితే సినిమాను 3 గంటలకంటే ఎక్కువ చూపించలేం కాబట్టి ఫైనల్ ఎడిటింగులో సినిమాను నిర్ణీత సమయానికి కుదించడానికి చాలా సీన్లు తీసేయాల్సి వచ్చింది.

Holy fight scene to adding to Bharat Ane Nenu movie

అలా ఎడిటింగులో లేపేసిన కొన్ని సీన్లను మళ్లీ కలపబోతున్నారు. ఈ మేరకు అభిమానులను అలరించడానికి యాక్షన్ సీన్ ను జోడించనున్నట్లు దర్శకుడు కొరటాల శివ తెలిపారు. సినిమా నిడివి ఎక్కువ అవుతుందని 'హోలీ' ఫైటింగ్ సీన్ ఫైనల్ ఎడిటింగ్ తీసేశాం, త్వరలోనే దానిని యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మే 4వ తేదీ నుండి ఈ కొత్త సీన్లు యాడ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సీన్ చూడటానికి ఆల్రెడీ సినిమా చూసిన ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ చిత్ర విజయంపై మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేనంత హ్యాపీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X