తెలుగు పరిశ్రమ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హాట్ సినిమా హోమం. ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. అది ఒక హీరో మరో హీరో ని డైరక్ట్ చేస్తున్న చిత్రం కావటం. ఇందులో నటుడు జె.డి.చక్రవర్తి విలన్ గా నటిస్తూనే జగపతి బాబుని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే జగపతి కి జోడీగా గాయని,నటి అయిన మమతా మోహన్ దాస్ కన్పిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రీరికార్డింగ్ పనిలో ఫుల్ బిజీగా ఉంది. హాలీవుడ్ హిట్ 'డిపార్టెడ్' ఆథారంగా రెడీ అవుతున్న ఈ సినిమా మాఫియా వారికి పోలీసులకి మథ్య జరిగే గేమ్ గా ఊహించని ట్విస్టు లతో నిండి థ్రిల్ చేస్తుంది. ఈ సినిమా ఆడియో ఈ వారంతంలో నిర్మాత కె.కిరణ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇక నిన్నటి హీరోయిన్ సాక్షి శివానంద్ ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్ లో కవపడి కిక్కివ్వబోతోంది. ఇలా అన్ని హంగులతో నిండిన 'హోమం' ఈ నెలాఖరుకు థియోటర్లను పలకరించనుంది.