దెయ్యంతో పోరాటం.. హారర్ కామెడీగా మిస్టర్ హోమానంద్!
హోమానంద్, పావని నాయకానాయకలుగా నటిస్తోన్న చిత్రం మిస్టర్ హోమానంద్. జై రామ్ కుమార్ దర్శకత్వంలో ఓంతీర్థం ఫిల్మ్ మేకర్స్ నిర్మిస్తోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈనెల 29న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నది.
హీరో హోమానంద్ పాత్రికేయులతో మాట్లాడుతూ...మా నాన్న కేశవ తీర్ధ సినీ నటుడు, నిర్మాత. గతంలో బెజవాడ పోలీస్‌స్టేషన్, అరె చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన స్ఫూర్తితోనే నేను సినిమాల్లోకి వచ్చాను. షార్ట్ ఫిలింస్‌లో నటిద్దామనుకొంటున్న సమయంలోనే లక్కీగా ఈ చిత్రంలో అవకాశం వచ్చింది. సత్యం పర్యవేక్షణలో నటశిక్షణ పొందాను. నటనలో ఎన్నో మెలుకువలు చేర్చుకొన్నాను. ఆయన శిక్షణ నాకు బాగా పనికివచ్చింది అని అన్నారు.

పావని నటిగా నా కంటే సీనియర్. ఆమెతో పోటీ పడి నటించగలిగా. మంచి సహనటి. ఈ చిత్రంలో నాది పిసినారి పాత్ర. పొగేసిన డబ్బుతో ఓ ఇల్లు కొంటా. అందులో ఓ దెయ్యం ఉంటుంది. కష్టపడి కొనుక్కున్న ఇంట్లో దెయ్యం ఏంటని కంగుతింటాను. ఆ దయ్యంతో నేను చేసే ఫైటే మిస్టర్ హోమానంద్ సినిమా కథ. హారర్ కామెడీ జోరర్ లో ఉంటుంది. సినిమా ఆద్యంతం నవ్విస్తుంది అని హోమానంద్ తెలిపారు.
డైరెక్టర్ జై రామ్ కుమార్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కథ చెప్పగానే చాలా కొత్తగా ఉంది అనిపించింది. నా ఫ్యామిలీ కూడా కథ బాగా నచ్చింది. దీంతో వెంటనే ఓకే చెప్పేశా. డైరెక్టర్ సినిమా బాగా తెరకెక్కించారు. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సుకుమార్, మారుతి ప్రొడక్షన్‌లో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ పనులు కథా చర్చల దశల్లో ఉన్నాయి.
రాజా వన్నెంరెడ్డిగారితో కూడా సినిమా ఉంటుంది. ఆ పనులన్నీ నాన్నకేశవ తీర్థ చూసుకుంటున్నారు. నేను అభిమానించే హీరో ఉపేంద్ర. ఆయన ఎంచుకునే కథలు బాగుంటాయి.యాక్టింగ్ కూడా కొత్తగా ఉంటుంది. నా ఎడ్యుకేషన్ ఇటీవలే బిబిఏ పూర్తిచేసాను అని తెలిపారు.


Click it and Unblock the Notifications











