For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో మరో పాన్ ఇండియా మూవీ: ఎన్టీఆర్‌కు ఝలక్.. ఏకంగా ప్రభాస్‌నే టార్గెట్ చేసి!

  |

  కొన్ని కాంబినేషన్లకు సినీ పరిశ్రమలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సాధారణంగా కొందరి కలయికలో సినిమా వచ్చి సక్సెస్ అయితే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ, కొన్ని కాంబోలు మాత్రం సెట్ అయితే బాగుంటాయి అనిపిస్తుంది. అలాంటి వాటిలో జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఒకటి. చాలా కాలంగా ఈ ఇద్దరి కలయికలో సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతోంది. దీనికి టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ సమయంలో ఓ భారీ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగి తారక్‌కు ఝలక్ ఇచ్చింది. అంతేకాదు, ప్రభాస్‌నే టార్గెట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  ఎన్టీఆర్‌ ఫ్యూచర్ ప్లాన్ అదిరిపోయింది

  ఎన్టీఆర్‌ ఫ్యూచర్ ప్లాన్ అదిరిపోయింది


  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాలో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా పట్టాలపై ఉండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో ప్రాజెక్టును చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ రెండే కాదు.. మరికొన్ని ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.

  క్రేజీ కాంబో ఫిక్స్.. టైటిల్ కూడా లీక్

  క్రేజీ కాంబో ఫిక్స్.. టైటిల్ కూడా లీక్

  రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలు పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని కూడా అంటున్నారు. అంతేకాదు, ఈ చిత్రానికి ‘మిస్సైల్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికితోడు ప్రశాంత్ ఆ మధ్య చేసిన ట్వీట్‌ చర్చనీయాంశం అయింది.

  జూనియర్ అసంతృప్తి.. ఆగిపోయింది

  జూనియర్ అసంతృప్తి.. ఆగిపోయింది

  లాక్‌డౌన్ సమయంలో ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్ ఓ పవర్‌ఫుల్ స్టోరీ చెప్పాడట. సైన్స్ వార్ నేపథ్యంలో సాగే దీనికి కొన్ని మార్పులు సూచించాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మరోసారి కలిసి కథ చెప్పగా.. దానిపై తారక్ అసంతృప్తి వ్యక్తం చేశాడని గుసగుసలు వినిపించాయి. దీంతో ఈ ప్రాజెక్టును కొద్ది రోజుల పాటు పక్కన పెట్టాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారని అనుకున్నారంతా.

   ప్రభాస్‌ను టార్గెట్ చేసిన మాస్ డైరెక్టర్

  ప్రభాస్‌ను టార్గెట్ చేసిన మాస్ డైరెక్టర్

  జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు లేకపోవడంతో ప్రశాంత్ నీల్.. కొద్ది నెలల క్రితం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు ఓ కథను చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం KGF 2 షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మరోసారి ప్రభాస్‌ను కలిశాడట సదరు డైరెక్టర్. అయితే, వాళ్ల ఏం చర్చలు జరిగాయన్నది మాత్రం బయటకు రాలేదు.

  మరో పాన్ ఇండియా మూవీ ప్రకటన

  మరో పాన్ ఇండియా మూవీ ప్రకటన

  KGFను నిర్మించిన హొంబళే ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా ఓ ప్రకటన చేసింది. ‘ప్రియమైన సినీ ప్రేక్షకులారా.. మీరు మాకంటే మా సినిమానే బాగా ఇష్టపడుతుంటారు. మాపై చూపిస్తున్న ప్రేమను కొనసాగించుకునేందుకు మేము త్వరలోనే ఓ ఇండియన్ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాము. మా ప్రకటన కోసం డిసెంబర్ 2 వరకు వేచి ఉండండి' అంటూ ట్వీట్ చేసింది.

  KGF Chapter 2 Satellite Rights Sold for Record Price 120Cr
   వాళ్లిద్దరి కాంబోలోనే అంటూ ప్రచారం

  వాళ్లిద్దరి కాంబోలోనే అంటూ ప్రచారం

  హొంబళే సంస్థ చేసిన ట్వీట్ ఎవరికి సంబంధించినదో తెలియదు కానీ... ఇది ప్రభాస్ - ప్రశాంత్ నీల్ సినిమానే అని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో యంగ్ రెబెల్ స్టార్ ఖాతాలో మరో పాన్ ఇండియా మూవీ రాబోతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, ప్రశాంత్ KGF 2 బిజీగా ఉండగా.. ప్రభాస్ ‘రాధేశ్యామ్' సహా పలు చిత్రాలను ప్రకటించాడు.

  English summary
  Director Prashanth Neel is basking in glory after his recent Kannada release KGF doing well at the box office. The film starred Yash in the lead role and released in five languages – Kannada, Hindi, Tamil, Telugu and Malayalam to positive reviews.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X