సందెట్లో సడేమియా! వద్దని చెప్పినా హీరోయిన్‌ను ముద్దాడిన దర్శకుడు!
ముంబై: ఇష్టం లేకున్నా ముద్దాడితే ఎంత చిరాగ్గా ఉంటుంది. అదే పరిస్థితి ఎదురైంది బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనెకు. బాలీవుడ్ మూవీ 'ఫైడింగ్ ఫన్నీ ఫెర్నాండెజ్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న హోమి అదజనియా ఇటీవల జరిగిన పార్టీలో దీపికకు ఇష్టం లేకున్నా ముద్దాడాడు. ఈ విషయం ఇపుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.
దీపిక పదుకొనె, అర్జున్ కపూర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న 'ఫైడింగ్ ఫన్నీ ఫెర్నాండెజ్' చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు హోమి అదజనియా దీపికను ముద్దాడే ప్రయత్నం చేసాడు. వద్దని దీపిక వారించినా అతను వినలేదు. ముద్దాడి తన కోరిక తీర్చుకున్నాడు.
అయితే ఈ విషయాన్ని రచ్చరచ్చ చేయడం ఇష్టం లేని దీపిక....లైట్ తీసుకుంది. దర్శకుడి చర్యను పెద్దగా పట్టించుకోకుండా పార్టీ ఫన్‌లో మునిగి పోయింది. అయితే ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్న మీడియా వారు ఆ సమయంలో దీపిక ముఖంలో హావభావాలు, ఆమె ప్రవర్తన ఆధారంగా అసలు విషయం కనిపెట్టేసారు. అన్నమాట సంగతి.
అయితే దీపికతో ఎఫైర్ ఉన్నట్లు వార్తల్లో ఉన్న రణవీర్ సింగ్ సింగ్ ఈ పార్టీకి కాస్త లేటుగా హాజరయ్యాడు. మరి అతని కళ్ల ముందు ఈ ఘటన జరిగి ఉంటే ఎలా స్పందించే వాడో? ఏది ఏమైనా దర్శకుడు హోమీ...చాలా లక్కీ అంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక్కడ జరిగిన పార్టీలో అర్ధరాత్రి వరకు పాల్గొన్న దీపిక, రణవీర్ ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్‌తో తెల్లవార్లు పార్టీలో మునిగి తేలారు. అంతకుము వీరు హోమీ పార్టీ నుంచి మీడియా కంట పడకుండా వేరు వేరు కార్లలో వెళ్లి పోయారు.


Click it and Unblock the Notifications












