twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వలింగ సంపర్కం: ఇబ్బందుల్లో అమీర్ ఖాన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ స్వలింగ సంపర్కానికి సంబంధించిన అంశంలో న్యాయపరమైన ఇబ్బందుల్లో పడ్డాడు. అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న ‘సత్యమేవ జయతే' కార్యక్రమంలో స్వలింగ సంపర్కాన్ని ప్రమోట్ చేస్తున్నారంటూ ఆయనకు కోర్టు నుండి నోటీసులు జారీ అయ్యాయి.

    చండీగర్ కోర్టు నుండి అమీర్ ఖాన్‌కు ఈ నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 19లోగా వివరణ ఇవ్వాలని కోర్టు తన నోటీసుల్లో పేర్కొంది. అమీర్ ఖాన్ తన టీవీ కార్యక్రమంలో హోమో సెక్సువాలిటీని ప్రమోట్ చేస్తున్నారంటూ పిటీషన్ దాఖలు కావడంతో కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

    Homosexuality: Bollywood actor Aamir Khan in trouble, gets court notice

    న్యాయవాది మాన్‍‌దీప్ కౌర్ ఈ పిటీషన్ దాఖలు చేసారు. సివిల్ కోర్టు జడ్జి జస్విందర్ సింగ్ శుక్రవారం అక్టోబర్ 31న ఈ నోటీసులు జారీ చేసారు. హోమో సెక్సువాలిటీ మీద సుప్రీం కోర్టు ఆధేశాలను ధిక్కరించే విధంగా అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న సత్యమేవ జయతే కార్యక్రమం ఉందని కౌర్ ఆరోపించారు. ఈ విషయంలో కోర్టు వెంటనే జోక్యం చేసుకుని అమీర్ ఖాన్ కోర్టు ధిక్కారంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

    అక్టబోర్ 19న ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో...స్వలింగ సంపర్కుల జీవన విధానం, హక్కుల గురించి చర్చించారు. ఇలాంటి చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయని న్యాయవాది తన పిటీషన్లో పేర్కొన్నారు.

    English summary
    Bollywood superstar Aamir Khan landed in a legal soup following his TV programme Satyamev Jayate. The actor received a court notice as he has been accused of promoting homosexuality.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X