Honey Rose: ఫ్యాన్స్ ఎగబడడంతో కింద పడిన హనీ రోజ్.. సన్నీ లియోన్ తరువాత ఆ రేంజ్ లో ఎఫెక్ట్!

హనీ రోజ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతొంది. ఇటీవల వీర సింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల పరిచయమైన ఈ భామ ఇప్పుడు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా జనాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే ఇటీవల ఈ భామకు సన్నిలియోన్ తరహాలో క్రేజ్ అందడం విశేషం. అయితే ఒక్కసారిగా ఫ్యాన్స్ ఎగబడడంతో ఆమె ఇబ్బంది పడి కింద పడిపోయింది. ఆ వివరాలలోకి వెళితే..

మొదట్లోనే డిజాస్టర్స్

మొదట్లోనే డిజాస్టర్స్

మలయాళం సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హనీ రోజ్ మొదట్లో పెద్దగా ఆఫర్స్ అయితే అందుకోలేకపోయింది. ఇక ఆమె గ్లామర్ విషయంలో తనను తాను మార్చుకోవడంలో ఆ తరువాత ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. హనీ రోజ్ 2005 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మొదట్లో ఆమ్స్ మలయాళ భాషలో తీసిన బాయ్ ఫ్రెండ్ అనే సినిమా డిజాస్టర్ అయ్యింది.

అప్పట్లోనే తెలుగు సినిమా

అప్పట్లోనే తెలుగు సినిమా

మొదట్లోనే కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు దొరకవేమో అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని హాని రోజు సౌత్ ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు అడుగులు వేసింది. అయితే తెలుగులో ఆమె వీరాసింహారెడ్డి సినిమా కంటే ముందు 2008లో శివాజీతో ఆలయం అనే ఒక సినిమా చేసింది. కానీ ఆ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియలేదు.

వరుసగా అవకాశాలు..

వరుసగా అవకాశాలు..

ఇక 2009 నుంచి ఆమె తన ప్రణాళికను మార్చి కన్నడ సినిమాలో అలాగే తమిళ్ మలయాళం.. ఇలా ఏ భాషలో అవకాశాలు వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. అయితే ఎక్కువగా మాత్రం హనీ రోజ్ కు మలయాళ ఇండస్ట్రీలోనే వరుసగా అవకాశాలు వచ్చాయి. చేసేది చిన్న పాత్ర పెద్ద పాత్ర అని చూడకుండానే మంచి కంటెంట్ ఉన్న పాత్రలు చేసుకుంటూ వెళ్ళింది. అలాగే కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచడంతో అవకాశాలు సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది.

 మధ్యలో మరో తెలుగు సినిమా

మధ్యలో మరో తెలుగు సినిమా

ఇక 2014లో 'ఈ వర్షం సాక్షిగా' అనే సినిమా చేసింది. అందులో వరుణ్ సందేశ్ హరిప్రియ జంటగా నటించారు. కానీ ఆ సినిమా కూడా ఆమెకు సక్సెస్ అవ్వలేదు. ఇక మళ్ళీ ఆమె తెలుగులో అవకాశాల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎక్కువగా మలయాళం ఇండస్ట్రీలోనే ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఇక అందులో ఆమె మై గాడ్, బిగ్ బ్రదర్ అనే సినిమాలతో మంచి క్రేజ్ అందుకుంది.

ఎగనడిన అభిమానులు

ఎగనడిన అభిమానులు

ఇక ఇటీవల తెలుగులో కూడా హనీ రోజ్ కు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా వీర సింహారెడ్డి సినిమా ద్వారా ఆమెకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఇటీవల కేరళలో ఊహించిన విధంగా హనీ రోజ్ కు ఒక చేదు అనుభవం ఎదురయింది. ఆమె ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఆమె కింద పడిపోయింది. ఇక తర్వాత మళ్ళీ ఆమె పెద్దగా ఇబ్బంది పడకుండా కారులోకి ఎక్కి ముందు అభిమానులకి అభివాదం తెలుపుతూ సైలెంట్ గా వెళ్ళిపోయింది.

సన్నీ లియోన్ రేంజ్ లో క్రేజ్..

అయితే హనీ రోజ్ వస్తోంది అని తెలియగానే భారీ సంఖ్యలో కుర్రాళ్ళు షాపింగ్ మాల్ కు చేరుకున్నారు. గతంలో మాజీ శృంగార తార సన్నిలియోన్ వస్తుంది అనగానే అదే తరహాలో జనాలు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు ఇక దాదాపు అదే తరహాలో మళ్లీ హనీ రోజ్ మలయాళం గడ్డపైనే అదే క్రేజ్ దక్కడం విశేషం. తెలుగులో కూడా ఆమెకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X