తొలి త్రీడి సెక్స్ చిత్రం ఇదే

By Staff

3D Sex and Zen
త్రీడి సినిమాలంటే ఇష్టపడని వారెవరుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఇవి చాలా ఇష్టం. అయితే పెద్దలు కూడా ఇలాంటి సినిమాలు చూడాలనుకున్నారో ఏమో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3డి సెక్స్ సినిమా రూపొందించడానికి హాంగ్‌కాంగ్ నిర్మాత ఒకరు నడుం బిగించారు. 30 మిలియన్ హాంగ్‌కాంగ్ డాలర్ల వ్యయంతో రూపొందించనున్న ఈ చిత్రం పేరు "3డి సెక్స్ అండ్ జెన్". ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మరియు ఒన్ డాలర్ ప్రొడక్షన్ ఛైర్మన్ స్టీఫెన్ షియు జూనియర్ మాట్లాడుతూ...'3డి సెక్స్ అండ్ జెన్' చిత్రం ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి సెక్స్ చిత్రమన్నారు.

చిత్రం గురించి మరిన్ని విశేషాలను చెపుతూ..."17వ శతాబ్దంనాటి చైనా శృంగారాన్ని రంగరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. ఈ చిత్రం 30శాతం శృంగారభరితమైన సన్నివేశాలతో నిండి ఉంటుంది. మత్తెక్కించే కొన్ని సెక్సీ సన్నివేశాలను క్లోజప్‌లో చిత్రీకరిస్తున్నాం. ఆ సన్నివేశాలలో నటించిన నటీమణిని ప్రేక్షకులు కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే చూడవచ్చు. కారణం ఈ చిత్రం 3డిలో రూపొందిస్తుండటమే"నని చెప్పారు.

అత్యంత శృంగారభరితమైన నటనను ప్రదర్శించగల హీరోయిన్ కోసం తాము వెతుకుతున్నట్లు చిత్ర నిర్మాత తెలిపారు. ఇప్పటికే కొందరు నటీమణుల జాబితా సిద్ధమైందనీ, అయితే వారికి సరిజోడుగా నటించగల పురుషులు ఇంతవరకూ తారస పడలేదన్నారు. వచ్చే ఏప్రిల్‌లో షూటింగ్ మొదలుపెట్టి డిశెంబరు నాటికి పూర్తి చేసి నూతన సంవత్సర కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. లోకో భిన్న రుచి అంటే ఇదేనమో...ఇలాంటి కోణం కూడా ఒకటుంటుందని ఇన్నాళ్ళూ ఎవరకీ ఆలోచన రాలేదు. దాంతో గిన్నీస్ బుక్ కి కూడా అప్లై చేస్తాడమో అంటున్నారు జనం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X