అలీకి పద్మశ్రీ అవార్డు కూడా ప్రకటించాలి
అలీ తెలుగు సినీ పరిశ్రమలో దాదాపుగా వెయ్యి చిత్రాల వరకు నటించాడని, డాక్టరేట్‌కు ఆయన అన్ని విధాలా అర్హుడే అని అంటున్నారు అలీ శ్రేయోభిలాషులు. త్వరలో అలీని రాజమండ్రి ఆహ్వానించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పౌరసన్మానం చేస్తామని తెలిపారు.
ఎన్నో చిత్రాల్లో అలీ అనేక రకాల పాత్రలు పోషించారని, అలీకి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వాలని ఆయన అభిమానులు, బంధువులు, శ్రేయోభిలాషులు కోరుతున్నారు. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు అలీ అన్ని విధాల అర్హుడే అని అంటున్నారంతా.
ఈ నెల 25న తమిళనాడులోని కోయంబత్తూరులో అలీ ఈ డాక్టరేట్ అందుకోబోతున్నారు. నేను ఇంత ఎత్తుకు ఎదగడానికి తన తండ్రే కారణమని, ఈ డాక్టరేట్‌ను తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు అలీ ప్రకటించారు. నటుడిగా నా అనుభవంతోపాటు గత అయిదేళ్లుగా నా తండ్రి పేరున 'మహ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్' పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నాను. ఆ కార్యకలాపాల్నీ గుర్తించి ఈ పురస్కారం అందిస్తున్నారు''అన్నారు అలీ.


Click it and Unblock the Notifications












