»   » సిల్క్ స్మిత పాత్రలో నిన్న విద్యాబాలన్-దివ్వభారతి పాత్రలో నేడు ధీక్షా సేథ్..!

సిల్క్ స్మిత పాత్రలో నిన్న విద్యాబాలన్-దివ్వభారతి పాత్రలో నేడు ధీక్షా సేథ్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొత్త కథలు క్రియేట్ చేసుకునే ఓపిక, టైము లేకపోవడంతో ఇప్పుడు చాలా మంది కుర్ర హీరోలు ఓల్డ్ ఫిలిమ్స్ ని రీమేక్ చేయడం, లేదా వాటికి సీక్వెల్ చేయడం అనే పనిలో పడుతున్నారు. 'లీడర్' రానా కూడా అదే బాటలో 'బొబ్బిలి రాజా' సినిమాని రీమేక్ చేసే ప్రయత్నంలో వున్నాడు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయింది. తన బాబాయ్ నటించిన ఆ హిట్ చిత్రాన్ని తను రీమేక్ చేయాలని రానా ఎప్పటినుంచో ఆశపడుతున్నాడు. దాంతో, తండ్రి సురేష్ బాబు ప్రస్తుతం దానికి సంబంధించిన పనిలో బిజీగా వున్నారు. అప్పటి కథను నేటి యూత్ ట్రెండ్ కి అనుకూలంగా మలచి, ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. 'బొబ్బిలి రాజా'లో అందాల తార దివ్య భారతి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పోలికలున్న దీక్షా సేథ్ ని కధానాయికగా తీసుకోవాలని రానా అనుకుంటున్నాడట. మరి దర్శకుడిగా అప్పటి బి.గోపాల్ నే పెడతారో లేక వి.వి.వినాయక్ లాంటి నేటి కమర్షియల్ డైరెక్టర్ ని పెడతారో చూడాలి.

కాగా బాలీవుడ్ భామ విద్యాబాలన్ కీ, నిన్నటితరం సౌతిండియన్ సెక్స్ బాంబ్ సిల్క్ స్మితకీ దగ్గర పోలికలున్నాయని సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న 'డర్టీపిక్చర్" సినిమాలో సిల్క్ స్మిత పాత్రను పోషిస్తోన్న విద్యాబాలన్, ఈ పాత్ర కోసం చాలా హోంవర్క చేసి తాను చాలా ఇష్టపడి చేస్తోన్న పాత్ర ఇదన్న విద్యాబాలన్, తన కెరీర్ లోనే ది బెస్ట్ ఫిలింగా 'డర్టీ పిక్చర్" మిగిలిపోతే, దీక్షాసెథ్ కి బొబ్బిలిరాజా దిబెస్ట్ చిత్రంగా మిగులుతుందని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu