తండ్రిలాగే మహేష్ బాబు కూడా సంక్రాంతి హీరో అవుతాడా?
మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిజినెస్ మెన్ మంచి దూకుడుతో షూటింగ్ జరుపుకుంటుంది. దూకుడు బిగ్ సక్సెస్ అందుకున్నా మహేష్ గ్యాప్ తీసుకోకుండా, వెంటనే బిజినెస్ మెన్ షూటింగ్ కు హాజరవుతున్నాడు. గతం లో సూపర్ స్టార్ కృష్ణకు సంక్రాంతి హీరోగా పేరుంది. సంక్రాంతికి కృష్ణ సినిమా వచిందంటే ఖచ్చితంగా హిట్ అనే టాక్ వుండేది. ఇపుడు ఆ స్థానాన్ని ఆయన నట వారసుడు ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ హీరో మహేష్ భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మహేష్ తాజా చిత్రం 'బిజినెస్ మ్యాన్"ను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.
దూకుడు కలెక్షన్ల పరంగా ఎంత సేన్సషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మహేష్ కు 'పోకిరి" తరువాత సరైన హిట్ లేక పోవడంతో అభిమానులు నిరస చెందుతున్న సమయంలో శ్రీను వైట్ల ద్వారా మహేష్ కు మంచి విజయం లభించింది. ఎవరూ ఊహించనంతగా దూకుడు హిట్ కావడంతో ప్రస్తుతం మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ పై అందరి దృష్టి పడింది.
80 సంవత్సరాల తెలుగు చలన చిత్ర చరిత్రలో దూకుడు రికార్డుల మోత మోగించింది. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ కలక్షన్లతో దూసుకు పోతున్నది. ఈ సినిమాకు మహేష్ నటనతో పాటు ఇతర అంశాలు కూడా కలసి వచ్చాయి. తెలుగులో సరైన హిట్ సినిమాలు కరువు కావడం, మరే ఇతర సినిమా పోటీ లేక పోవడం ఎక్కువ దియేటర్ల లో సినిమా విడుదల కావడం ఇలాంటి చాలా కారణాలు తో దూకుడు సూపర్ డూపర్ హిట్ అయింది.
ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న మహేష్ తాజా చిత్రం 'ది బిజినెస్ మ్యాన్'. 'పోకిరి" కాంబినేషన్ లో మళ్ళీ ఈ సినిమా రావడం తో అంచనాలు భారీగా వున్నాయి. దర్శక నిర్మాతలు కూడా దూకుడు కంటే ఎక్కువ దియేటర్లలో రిలీజ్ చేసి అంతకంటే ఎక్కువ హిట్ చేయాలని ఇప్పటినుండే థియేటర్లను బుక్ చేసే పని లో వున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











