»   » తేజ ‘హోరా హోరీ’ సురేష్ బాబు రీలీజ్ చేస్తున్నారు

తేజ ‘హోరా హోరీ’ సురేష్ బాబు రీలీజ్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో 'అలా మొదలైంది', ‘అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, ‘నువ్వు నేను', జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హోరా హోరీ'. దిలీప్,దక్ష హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘'మా నాన్నగారి స్ఫూర్తితో నేను నిర్మాతగా మారాను. వైవిధ్యమైన కథాచిత్రాలను అందించిన మా బ్యానర్ లో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ తేజ దర్శకత్వంలో సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. దిలీప్, దక్ష చాలా చక్కగా నటించారు. ఇందులో అందరూ కొత్త నటీనటులే నటించారు. సినిమా ఫస్ట్ లుక్ నుండి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల కళ్యాణ్ కోడూరి అందించిన ఆడియో విడుదలై మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చిది. కర్ణాటకలో 53రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరిపాం. సినిమా చాలా బాగా వచ్చింది. దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరి. తేజ మరోసారి ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వరల్డ్ వైడ్ గా సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.


Hora Hori to release on 11 Sep

దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కళ్యాణ్: పాటలు: పెద్దాడ మూర్తి: రచనా సహకారం: ఆకెళ్ళ శివప్రసాద్, బాలకుమారన్, కెమెరా: దీపక్ భగవంత్; ఎడిటర్: జునైద్; కాస్ట్యూమ్ డిజైనర్; శ్రీ; స్టంట్స్: పాంథర్ నాగరాజు: నృత్యాలు: శంకర్, కెవిన్; సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి. వి ; నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్; కధ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: తేజ.

English summary
Hora Hori to release on 11 September 2015.
Please Wait while comments are loading...