గుఱ్ఱం ఎక్కి తాడు పట్టుకొంటే వచ్చేసిది కాదు: రామ్ చరణ్ తేజ్
ప్రతి స్కూల్ లో హార్స్ రైడింగ్ గేమ్ ను పెట్టాలని చరణ్ కోరాడు. హార్ రైడ్ చేయడం వల్ల పిల్లలో తెలివి తేటలు పెరుగుతాయి. కాన్స్ ట్రేషన్ పెరుగుతుంది. హార్స్ రైడింగ్ నేర్చేసుకోవాలని గుఱ్ఱం ఎక్కి తాడు పట్టుకొంటే వచ్చేసిది కాదు, అంత సులువైన పని కూడా కాదు..ఏకాగ్రత చాలా అవసరం అది చిన్నపిల్లలకు చాలా అవసరం. అందుకే స్కూల్స్ హార్స్ రైడింగ్ గేమ్ పెట్టమని ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.
ఇటీవలే చరణ్ హైదరాబాద్ పోలో టీంను సొంతం చేసుకున్న సంగతి విధితమే అయితే ఈ సంధర్బంగా రామ్ చరణ్ నిన్న హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో మీడియాతో మాట్లాడుతూ..తన టీంను ఎంకరేజ్ చేయండి. నేను నటించిన 'మగధీర" చిత్రం అంత విజయం సాధించడానికి గల కారణం నాన్న గారు నాకు హార్స్ రైడింగ్ లో శిక్షణ ఇప్పించడం వల్లే. హార్స్ రైడింగ్ లో శిక్షణ తీసుకోకుంటే 'మగధీర"లో ఆ విధంగా నేను చేసి ఉండేవాన్ని కాదంటు చరణ్ తెలిపాడు..
రామ్ చరణ్ కు ఉన్నట్టే తకు కాబోయే భార్య ఉపాసనకు కొన్ని గుఱ్ఱాలు వున్నాయని, తనకు కూడా హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టమని, తను కూడా త్రీ ఇయర్స్ నుండి హార్స్ రైడింగ్ నేర్చుకొంటోందని తెలిపాడు. ఆమె తాతగారైనటువంటి ప్రతాప్ రెడ్డికి కూడా హార్స్ రైడింగ్ అంటే చాలా మక్కువంట...అతని దగ్గర కూడా కొన్ని గుఱ్ఱాలు వున్నాయన్నారు.


Click it and Unblock the Notifications











