twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రూస్ లీ: చిరు, చరణ్ మధ్య హార్స్ రైడింగ్ సీన్ (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రూస్ లీ' సినిమా అభిమానులకు మెగా కనువిందుగా ఉండబోతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి 3 నిమిషాల పాటు గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే చిరంజీవిపై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది.

    సెట్స్ లో చిరంజీవికి సంబంధించిన ఫోటోలు కూడ బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో చిరు, చరణ్ మధ్య హార్స్ రైడింగ్ సీన్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటో బయటకు లీకైంది. చిరంజీవి గెస్ట్ రోల్ సినిమాకే హైలట్ అవుతుందని అంటున్నారు.

    ఇక అక్టోబర్‌ 2న 'బ్రూస్‌లీ' గీతాలను విడుదల చేయనున్నారు. అలాగే ఈ ఆడియో వెన్యూ కూడా ఫైనలైజ్ అయ్యింది. హైదరాబాద్ ..హైటెక్స్ గ్రౌండ్ లో ఘనంగా జరగనుంది. టాప్ టాలీవుడ్ సెలబ్రెటీలు ఈ ఫంక్షన్ కు హాజరవనున్నారని సమాచారం.

    Horse Riding Scenes On Chiranjeevi And Ram Charan In Bruce Lee

    రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేసినట్లు సమాచారం.

    ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    WHOA! Looks a mega feast is in store for mega fans with Ram Charan's forthcoming release Bruce Lee. Going by the pictures that are making rounds on the social networking sites, Chiranjeevi's 3 min role appears to have been stuffed with all the high moments that his fans are waiting to witness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X