twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోలను ట్రాప్ చేస్తున్న హాట్ హీరోయిన్

    By Sindhu
    |

    ఇప్పుడు గతంలలా లేదు, ఏ రోజు కారోజే హీరోయిన్ల రేంజ్ మారిపోతోంది. ఒకే ఒక్క సినిమాతో అమాంతం స్టార్ స్టేటస్ తెచ్చేసుకుంటున్నారు. ఆ విధంగా తాజాగా టాలీవుడ్ లో అమలాపాల్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తమిళనాట ఇప్పటికే మంచి పొజిషన్ లో వున్న అమలా విక్రమ్ హీరోగా నటించిన 'నాన్న' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. వెంటనే నాగచైతన్యతో 'బెజవాడ' సినిమాలో హీరోయిన్ గా బుక్కయింది. ఇప్పుడు చాలా మంది తెలుగు హీరోలు అమలా జపం చేస్తున్నారు.

    దక్షిణాదిలో నాన్న తర్వాత ప్రేమఖైది చేసి మంచి క్రేజ్ తెచ్చుకొన్న అమలకు బాగా డిమాండ్ పెరిగింది తమ సినిమాల్లో ఆమెను బుక్ చేయమని రామ్ చరణ్ తేజ్, జూ ఎన్టీఆర్ తమ నిర్మాతలకు చెప్పారట. అలాగే, మరికొంత మంది కూడా ఆమె కోసం ట్రై చేస్తున్నారు. దీంతో ఇక్కడ హఠాత్తుగా ఏర్పడిన ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని ఆమె భావిస్తోంది. తన వద్దకు వచ్చే నిర్మాతలకు రెమ్యునరేషన్ ఎనభై నుంచి కోటి వరకు చెబుతోందని అంటున్నారు. హీరో బుక్ చేయమంటే, తెలుగు నిర్మాతలు ఎంత రేటు పెట్టయినా హీరోయిన్ని బుక్ చేస్తారన్న విషయం అమలాకు బాగా తెలుసు. అందుకే, తన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.

    నాగచైతన్య, అమలాపాల్ జంటగా రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ' సినిమా షూటింగు హైదరాబాదు షెడ్యులు పూర్తయింది. ఫారిన్ షూటింగ్ కోసం చిత్రం యూనిట్ స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్లింది. గురువారం (సెప్టెంబర్ 15) నుంచి హీరో హీరోయిన్లపై పాట చిత్రీకరణ మొదలుపెడుతున్నారు. స్విట్జర్లాండ్ తో బాటు ఇటలీ, ఒమెన్ లలో పదిరోజుల పాటు జరిగే షూటింగులో రెండు పాటలను చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తవుతుంది. దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత కోనేరు కిరణ్ కుమార్ చెప్పారు. దర్శకుడు వివేక్ కృష్ణ చెబుతూ, బెజవాడ నగరాన్ని ఓ క్యారెక్టర్ గా తీసుకుని దీనిని రూపొందిస్తున్నామనీ, నాగచైతన్య హీరోయిజాన్ని పూర్తిగా చూపించే సినిమా ఇదనీ అన్నారు.

    English summary
    Film maker Ramgopal Varma has also eyed up on Amala to get her booked for Bezawada besides Naga Chaitanya. If this film happens to be a commercial hit, then she would climb up the ladder in Telugu circuit. However her track record in Kollywood makes a point clear that, Amala has got the sexy oomph and envious appeal that can woo any sort of big heroes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X