అందాలతో బరితెగింపు...సెక్సీ సదా లక్ష్యం అదేనా?
సినిమా పరిశ్రమలో ఎంటరైన ప్రతి హీరోయిన్ కు ఒక లక్ష్యం ఉంటుంది. అందంతో పాటు అభినయంతోనూ రాణించి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. అయితే అన్నీ ఉన్నా ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే హీరోయిన్ గా సక్సెస్ అవుతారు. అలా కాకుండా ఫెయిల్యూర్ అయిన నేపథ్యంలో....అందాలే పెట్టుబడిగా, అంగాంగాలు ప్రదర్శిస్తు తమపై అందరి దృష్టి పడేలా చేస్తారు. అదీ కుదరక పోతే ఐటం సాంగులు, వ్యాంపు పాత్రలు ఇలా అన్ని దారులు తొక్కుతారు.
వెళ్లవయ్యా వెళ్లూ అంటూ 'జయం'తో ప్రేక్షకుల హృదయాలకి గాలం వేసిన అందాల తార సదా. అయితే ఆ సినిమా తర్వాత ఆమెకి తెలుగులో సరైన విజయాలు దక్కలేదు. దాంతో తమిళ చిత్రాల వైపు దృష్టిపెట్టిన సదా అక్కడకూడా 'జయం' రీమేక్‌తోతొలి విజయాన్ని అందుకుని శంకర్ తీసిన 'అపరిచితుడు'తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయినప్పటికీ ఆ హిట్ల తర్వాత ఆశించిన అవకాశాలు లభించలేదు. దీంతో రూటు మార్చాలని నిర్ణయించుకుంది.
'గ్లామర్‌తో మెప్పిస్తా' అంటూ స్టేట్‌మెంట్స్ ఇవ్వడమే గాక అలాంటి పోజుల్లోనూ దర్శనమిస్తోంది సదా. ప్రస్తుతం సదా తెలుగులో శివాజీతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. అతిగా అందాలు ఆరబోసిన హీరోయిన్...అతిగా బిల్డప్ ఇచ్చే హీరో టాప్ రేంజ్ వెళ్లినట్లు చరిత్రలో లేదు...మరి సదా పరిస్థితి ఏమౌతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











