నమ్మలేరు గానీ ఇదే నిజం.. సిమ్రన్ వచ్చేస్తోందీ

సిమ్రాన్, ఒకప్పుడు తెలుగు తెరపై టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన హీరోయిన్. అప్పట్లో తెలుగు అగ్రహీరోలందరితో నటించిన సిమ్రన్ తన నటనతోనూ, గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. షరా మామూలుగానే కొత్త హీరోయిన్ల రాకతో సిమ్రాన్ క్రమక్రమంగా తెరమరుగైపోయింది. సౌత్ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో వెలిగిపోయిన ముంబై బ్యూటీ సిమ్రన్. తెలుగులో టాప్ హీరోలందరినీ సినిమాలు చేసేసిన రికార్డ్ కూడా ఉంది.

పెళ్లి చేసుకునే వరకూ తెగ సినిమాలు చేసేసిన సిమ్రన్.. మూడేళ్ల క్రితం రీఎంట్రీ ఇచ్చి గెస్ట్ కేరక్టర్లతో "ఆహా కళ్యాణం"లాంటి సినిమాల్లో అడపాదడపా మెరుస్తూ ఉన్నా, సిమ్రన్ ఎక్కువగా బుల్లితెర కార్యకలాపాలకే పరిమితం అయింది. అయితే, మంచి స్క్రిప్ట్ దొరికితే ఫూల్ లెంత్ పాత్రతో గట్టిగా తన పునరాగమనాన్ని చాటుకోవాలి అని సిమ్రన్ ఆశిస్తోంది అని తెలుస్తోంది. ఇప్పుడీ భామకు ఓ బంపరాఫర్ తగిలిందని తెలుస్తోంది.

Hot actress Simran with Arvind Swamy next new movie

అయితే ఇప్పుడు ఓ తమిళ సినిమాలో మాంచి రోల్ కు సిమ్రాన్ సైన్ చేసిందట. సెల్వారాఘవన్ దర్శకత్వంలో అరవింద్ స్వామి, రితిక సింగ్ నటించే సినిమాలో పోలీస్ ఇన్ స్పెక్టర్ క్యారెక్టర్ పోషించేందకు సిమ్రాన్ ఓకె చెప్పిందట.త్వరలో ఈమె ఓ పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించబోతోందిట. దాదాపుగా సినిమాను లీడ్ చేసే పాత్ర అని తెలుస్తోంది. మరోవైపు.. ఈ చిత్రంలో అరవింద్ స్వామితో కలిసి నటించనుంది సిమ్రన్.

తని ఒరువన్.. ధృవ లాంటి సినిమాల్లో నెగిటివ్ కేరక్టర్లతో ప్రస్తుతం తన కెరీర్ లోనే టాప్ ఫాంలో ఉన్న అరవింద్ స్వామితో మూవీ అంటేనే ఆసక్తి రెట్టింపయిపోతోంది. అయితే.. ఈ చిత్రంలో లీడ్ కేరక్టర్లు వీళ్లిద్దరే అయినా.. ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉండవట. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా సిమ్రన్ నటన ఈ మూవీకి హైలైట్ కానుందని అంటున్నారు.

ఇన్నాళ్లు సరైన క్యారెక్టర్ దొరకకే ఎవ్వరు అడిగానా ఓకె చెప్పలేదని, ఇప్పుడు సెల్వా చెప్పిన కథ, అందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చేసానని అంటోంది సిమ్రాన్. ఈ లెక్కన మన జనాలు కూడా మంచి పాత్రలు వుంటే సిమ్రాన్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. మన జనాలకు సిమ్రాన్ అంటే బాగా గుర్తే కదా?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X