»   » షాక్: హీరోయిన్లను మించిన అనుసూయ రెమ్యూనరేషన్

షాక్: హీరోయిన్లను మించిన అనుసూయ రెమ్యూనరేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ వస్తోంది అనసూయ. ఆకట్టుకునే అందం, చలకీతనం, మాటల్లో గడుసుతనంతో ఆమె యాంకరింగ్ రంగంలో దూసుకెళ్లడంతో పాటు సినిమాలు అవకాశాలు కూడా దక్కించుకుంటోంది.

అందగత్తె కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సైతం ఎక్కువే. ఇక తరచూ ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో అనసూయ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో పలు సంస్థలు ఆమెతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించడానికి ఆసక్తి చూపుతున్నారు.


 Hot anchor Anasuya remuneration

ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ‘సోగ్గేడే చిన్ని నాయనా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు గాను అమ్మడు రోజుల లెక్కన రెమ్యూనరేషన్ తీసుకుందట. రోజుకు 4 లక్షల చొప్పున 10 రోజులు షూటింగులో పాల్గొన్నందుకు రూ. 40 లక్షలు చార్జ్ చేసినట్లు సమాచారం.


తెలుగులో అదా శర్మ, రెజీనా లాంటి హీరోయిన్లకు కూడా రోజు 4 లక్షల రేంజిలో రెమ్యూనరేషన్ లేదు. వారు నెలల తరబడి షూటింగుల్లో కష్టపడతారు. పైగా డాన్సులు, హాట్ రొమాంటిక్ సీన్లు, ముద్దు సీన్లు ఇలా చాలా చేయాలి. కానీ అవేమీ లేకుండానే అనసూయ ఈ రేంజిలో రెమ్యూనరేషన్ అందుకోవడం హాట్ టాపిక్ అయింది.

English summary
Hot anchor Anasuya has given her nod to Nagarjuna starrer Soggade Chinni Nayana and it is learnt that Anasuya asked for remuneration on a daily basis and she agreed to work for 4 lakhs a day. The lady gave 10 days dates for the film and in her own maths she had earned about 40 lakhs.
Please Wait while comments are loading...