అబ్బ...అంత లేదు అంటూ అనసూయ
హైదరాబాద్ : సెలబ్రెటి స్ధాయికి వెళ్లిన తర్వాత వారిపై ఏదో ఒక న్యూస్ రావటం...అది కరెక్టు కాదంటూ ఖండించటం కామన్ అయిపోయింది. ముఖ్యంగా సామాజిక అనుసంధాన వేదికలు...మీడియా పాత్రను పోషిస్తున్న నేపధ్యంలో ఇది మరింత ఈజీగా మారింది. గతంలో ఏదన్నా మీడియా హౌస్ ని సంప్రదించి ఖండించాల్సి వచ్చేది. ఇప్పుడు తమ చేతిలో ఉన్న ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా తమపై వచ్చిన వార్తలపై వారు స్పందిస్తున్నారు. తాజాగా యాంకర్ అనుసూయ అలాంటి ఖండన ఒకటి చేసేసింది.
అనసూయ రీసెంట్ గా ఓ సినిమా సైన్ చేసిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె కోటి రూపాయల రెమ్యునేషన్ తీసుకుంటోందంటూ పాపులర్ ఇంగ్లీష్ డైలీలో వార్త వచ్చింది. ఈ విషయమై ఆమె ఖండన లా ట్విట్టర్ లో అబ్బే అలాంటిదేం లేదని అంది. అంతేకాకుండా తను సినిమా ఓకే చేసిన వార్త నిజమే అని, అది ఓ రిప్యూటెడ్ కంపినీ అని తెలియచేసింది. మిగతా వివరాలు ఒక నెలలో చెప్తానని హామీ కూడా ఇచ్చేసింది.

న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బిందాస్, జబర్దస్త్ గేమ్ షోలకు వ్యాఖ్యాతగా, సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే విషయమై కామెంట్స్ చేసి మరీ అందరి దృష్టిలో మరోసారి పడింది. సినిమావాళ్లను సైతం ఆమె ఆకర్షించినా ఆచి,తూచి తన బుల్లి తెరకెరీర్ పై ముందుకు వెళ్తోంది.
గతంలో ఆమె పవన్ కళ్యాణ్ చిత్రం చూసి సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ‘అత్తారింటికి దారేది' చిత్రంలో అనసూయను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె అప్పట్లో రిజెక్ట్ చేసి వార్తల్లోకి ఎక్కింది.


Click it and Unblock the Notifications











