twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ అందం,అభినయ సుగంధం అనుష్క (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : స్వీటీ అనే ముద్దుపేరున్న అనూష్క తన అందాల ప్రదర్శనతో కుర్రకారులో మధురభావనలు రేపుతోంది. సరోజగా కవ్వించినా,భిళ్లాలో బికినీతో కనిపించినా,విక్రమార్కుడుతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ చేసినా ఆమెకే ఆమే పోటీ..సాటి అన్నట్లుగా తెరను వేడిక్కిస్తోంది. త్వరలో ఢమురకం మ్రోగించటానికి రెడీ అవుతున్న ఆమె తెలుగు,తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది.

    మొదట్లో అనూష్క అందాల ప్రదర్శనికే ప్రయారిటీ ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుతంగా నటించిందంటూ మీడియా ప్రశంసించింది. అంతేగాదు అనుష్క సైతం తాను కేవలం అరుంధతి చిత్రంతోనే నటనకు అలవాటు పడ్డాను అంటుంది. ప్రస్తుతం మాత్రం ఆమె సినిమాల్లో ఎక్కువ భాగం ఆమె నటనకోసం తీసుకున్నవే.

    హాట్ అందం,అభినయ సుగంధం అనూష్క (ఫోటో ఫీచర్)

    కన్నడ భామ అనుష్క శెట్టి తెలుగు,తమిళ సినీ ప్రేమికుల కలల దేవత. బెంగుళూరు నగరానికి చెందిన అనూష్క యోగా శిక్షకురాలుగా కెరీర్ ప్రారంభించి,నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది.

    హాట్ అందం,అభినయ సుగంధం అనూష్క (ఫోటో ఫీచర్)

    సూపర్ తర్వాత అస్త్రం, చింతకాయల రవి, స్వాగతం,ఒక్క మగాడు వంటి చిత్రాలు చేసినా రాని బ్రేక్ రాజమౌళి విక్రమార్కుడుతో వచ్చింది. అందులో క్లైమాక్స్ లో జింతాత అంటూ ఆమె చేసే అభినయానికి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

    హాట్ అందం,అభినయ సుగంధం అనూష్క (ఫోటో ఫీచర్)

    చిరంజీవి స్టాలిన్ లో ఐటం సాంగ్ (ప్రత్యేక నృత్యం)చేసినా ఆ తర్వాత వాటికి దూరంగా ఉండిపోయింది. తన పాత్ర నచ్చి సినిమాలు చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటూ వస్తోంది.

    హాట్ అందం,అభినయ సుగంధం అనూష్క (ఫోటో ఫీచర్)

    తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైన ఆమె సూర్యతో చేసిన యముడు(సింగం)తో అక్కడివారికి ఆరాధ్య దేవతగా మారింది.

    హాట్ అందం,అభినయ సుగంధం అనూష్క (ఫోటో ఫీచర్)

    గోపీచంద్ తో చేసిన లక్ష్యం చిత్రం ఆమెకు మరోసారి లైఫ్ ఇచ్చింది. తర్వాత చేసిన డాన్,మహానంది చిత్రాలు నిరసపరిచినా ఆమె అవకాశాలపై వాటి ప్రభావం పడలేదు.

    హాట్ అందం,అభినయ సుగంధం అనూష్క (ఫోటో ఫీచర్)

    అనూష్క కి మేజర్ బ్రేక్ ఇచ్చిన చిత్రం 2009లో వచ్చిన అరుంధతి. ఆ తర్వాత ఆమెలోని నటిని వెలికి తీసిన చిత్రం వేదం (2010). ఈ రెండు చిత్రాలు లేకపోతే తన కెరీరే లేదు అంటుంది అనూష్క.

    English summary
    Anushka Shetty is an Indian film actress who works mainly in the Telugu and Tamil film industries. She debuted in the 2005 Telugu film Super and rose to fame following her performance in Vikramarkudu (2006). She received high critical acclaim for her portrayal of the titular character in Arundhati and as Saroja in Vedam which fetched her two Filmfare, one Nandi and two CineMAA Awards. After starring in blockbuster Singam (2010), her biggest commercial success, she became one of South India's most leading actresses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X