రాజమండ్రిలో రంభలా ప్రత్యక్షమైన అనుష్క
హైదరాబాద్: హాట్ హీరోయిన్ అనుష్క ఉన్నట్టుండి రాజమండ్రిలో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఆమె ప్రస్తుతం తమిళ హీరో ఆర్యతో కలిసి 'ఇరండమ్ ఉలగం'(తెలుగులో బృందావనంలో నందకుమారుడు) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న షూటింగ్ తాజాగా రాజమండ్రిలో జరుగుతోంది.
షూటింగులో భాగంగా అనుష్క రాజమండ్రి చేసుకుంది. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. ఇక ఈ సినిమాలో బృందావనంలో గోపికగా అనుష్క ఆరబోయనున్న అందచందాల కోసం కుర్రకారు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజుల క్రితం జార్జియా అడవుల్లో జరిగింది. 85 మంది మగాళ్ళ మధ్య జార్జియా అడవుల్లో అనుష్క ఒంటరిగా గడిపింది. అక్కడ బెడ్ ఉండదు. కరెంట్ ఉండదు. ఏ ఇతర వసతులుండవు. అయినా అనుష్క ఏ కంప్లయింట్ చేయలేదట.
ఇక అనుష్క నటించిన 'మిర్చి' చిత్రం నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' సినిమా చేస్తోంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications












