లక్కీ ఛాన్సుతో ‘రానా’కి కిక్ ఇస్తానంటోన్న ఇలియానా...!
ఎంతో శోభాయమానంగా ఆరంభమైన రానా షూటింగ్ రజని అనారోగ్యంతో పోస్ట్ ఫోన్ అయింది. సింగపూర్ లో ట్రీట్మెంట్ అనంతరం రజనీకాంత్ షూటింగ్ కి రెడీ అయ్యారు. ప్రస్తుతం రజనీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో తన కొత్త సినిమా 'రానా" చిత్రం షూటింగ్ లో పాల్గొనడానికి సిద్దపడుతున్నారట. ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా ఇలియానా ఖరారయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
'పోకిరి" అందాలతో కుర్రకారు మతి పోగొట్టిన హాట్ బ్యూటీ ఇలియానా చేజారిన ఆఫర్ లక్కీగా అందిపుచ్చుకుంది. సూపర్ స్టార్ రజనికాంత్ హీరోగా నటిస్తోన్న రానా సినిమాలో ఓ కీలక రోల్ చేసేందుకు ఓకే చెప్పేసింది. ఇటీవల ఇలియానాతో ఈ చిత్ర దర్వకుడు కెయస్ రవికుమార్ చర్చలు జరిపి ఆమె డేట్స్ తీసుకున్నాడని సమాచారం.మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రానా మూవీ లో నటిస్తున్నందుకు ఇలియానా హ్యాపీగా ఫీల్ అవుతుందట.
కాగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుందని సమాచారం. ప్రస్తుతం ఇలియానా తమిళంలో శంకర్ దర్శకత్వంలో 'నన్బన్" చిత్రంలో, హిందీలో 'బర్ఫీ" సినిమాలోనూ నటించేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించనుంది.


Click it and Unblock the Notifications











