హాట్ బ్యూటీ ప్రియమణి..ర్యాగింగ్ అనుభవం

By Srikanya

తొలి రోజు ర్యాగింగ్‌ నుంచి తప్పించుకోవటం ఎలా అనేది కాలేజీ రోజుల్లో ఓ పెద్ద టెన్షన్ అంటూ ప్రియమణి ఆ రోజుల్ని గుర్తు చేస్కుకుంటోంది. కాలేజీలో అడుగుపెట్టేడప్పుడు ఇక కాన్వెంట్ యూనిఫామ్ వేసుకోవక్కర్లేదు. చక్కగా నచ్చిన డ్రెస్ లను వేసుకుని మెరిసిపోవచ్చు అనుకుంటూ ఆనందపడింది. అయితే ఆమె స్నేహితురాళ్ళు ర్యాంగింగ్ గురించి చెప్పినప్పుడు మాత్రం భయం పుట్టుకొచ్చిందిట. అయితే అప్పట్లోనే ఆమెకు జీనియస్ ఐడియాలు ఫ్లాష్ అవుతుండేవి. దాంతో ఆమె ఓ బీబత్సమైన ప్లాన్ వేసింది. ఒంటరిగా అయితే బుక్‌ అవుతాం. అదే పది, పదిహేను మంది స్టూడెంట్స్‌ మధ్యలో దూరిపోయి క్లాస్‌రూమ్‌లోకి వెళ్లిపోతే హ్యాపీ అన్నది ఆ ఆలోచన. వెంటనే దాన్ని అమలు పరిచి నలుగురితో కలిసి వడివడిగా క్లాస్‌రూమ్‌లోకి వెళ్లి కూర్చున్నారు ప్రియమణి. ఆ తరువాత అలవాటు పడేదాక అదే స్కీమ్ ఫాలో అయింది. అయితే నెక్ట్స్ ఇయర్ కి ప్రియమణి సీనియర్‌ అయ్యింది. ఇప్పుడు జూనియర్లను ర్యాగింగ్ చేయటం ప్రియమణి చెయ్యాలి.

కానీ తను భయపడినట్లుగానే అందరూ ర్యాగింగ్‌కి భయపడతారు కాబట్టి జూనియర్స్‌తో స్నేహంగా ప్రియమణి మెలిగేదాన్నని చెపుతోంది. మొత్తం మీద కాలేజ్‌ లైఫ్‌ని ఈ బ్యూటీ బాగానే ఎంజాయ్‌ చేశానంటోంది. అందుకే.. "ఆ రోజులే వేరండి. ఆ సమయంలో వాటి విలువ తెలియలేదు కానీ ఇప్పుడు తల్చుకుంటే భలే మజాగా అనిపిస్తుంది. దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే పాత రోజులు మళ్లీ కావాలంటాను' అంటోంది ప్రియమణి. అదీ ప్రియమణి ర్యాగింగ్ వ్యవహారం. మొన్న ప్రవరాఖ్యుడుతో పలకరించిన ఆమె తాజాగా పూరీ జగన్నాధ్ గోలీమార్ చిత్రంలో బుక్ అయింది. అలాగే శంభో శివ శంభో చిత్రంలో రవితేజ సరసన చేస్తోంది. ఆమె జగపతిబాబుతో చేసిన సాధ్యం చిత్రం విడుదలకు రెడీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X