twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రియ వేదాంత ధోరణికి ఆశ్చర్య పోతున్నారు...!

    By Sindhu
    |

    హాట్ బ్యూటీ శ్రియ ఇటీవల ఒక ప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అనుభవమే నా గురువు" అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఏమి తెలిసేది కాదని కాలంతో పాటు సరైన స్క్రిప్టులు మంచి వ్యక్తులు పరిచయ్యమయ్యారని శ్రియ తెలిపింది. ఆ మధ్య రవితేజ సరసన 'డాన్ శీను' లో నటించాక చాలా గ్యాప్ తో ఇప్పుడు అల్లరి నరేష్ సరసన నటిస్తోంది అందాల తార శ్రియ. ఇందులో శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్నాడు. నారా రోహిత్ హీరోగా 'సోలో'ను నిర్మించిన ఎస్వీకే సినిమా అధినేత వంశీకృష్ణ శ్రీనివాస్ ఈసినిమాని నిర్మిస్తున్నారు. నారాయణదర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

    చాల గ్యాప్ తర్వాత శ్రియ చేస్తున్న తెలుగు చిత్రం ఇదే. మీరు జీవితంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నానా అని భాధ పడిన సందర్భాలున్నయా అని ఒక ప్రశ్న అడగగా అలాంటి సందర్భం తనకు ఎప్పుడు ఎదురు కాలేదని, తన క్రింది స్థాయి వ్యక్తి ఏదైనా చెప్పిన దానిలో తాను వినడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. సినిమాల్లోకి వచ్చినందుకు నేను ఎన్నడూ భాధపడలేదు. ఈ రంగంలోకి వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. నేను ఓ స్టేజికి ఎదిగా. ఇప్పుడు నాకు కావలసినవన్నీ అందుబాటులో ఉన్నాయంటే కారణం ఈ రంగమే. నేను స్వతంత్రురాల్ని. నా మనసు ఎలా గైడ్ చేస్తే అలా నడుస్తున్నా. ఏదైనా ఓ పని నా మనసు లగ్నమైందంటే దాన్ని సాధించేదాకా వదలను" అని తెలిపింది శ్రియ.

    సక్సెస్ ఉంటేనే సినీ రంగంలో ఉంటాననే సంగతి శ్రియకు బాగా తెలుసు. ఇక్కడ ఫెయిల్యూర్స్ వస్తే మళ్లీ మన మొహం చూడరనే సంగతి అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. అందుకే సినిమాల ఎంపికలో కేరక్టర్ కే ప్రాధాన్యమిస్తా. సబ్జెక్ట్, బేనర్, డైరెక్టర్ వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు ఒప్పుకుంటున్నా అని చెప్పిందామె.

    English summary
    Hot beauty Shriya has a philosophical side and that was revealed in a recent interview she gave to a leading newspaper. “Experience is my guru. I had no knowledge about the film industry when I came in.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X