హాట్ బ్యూటీ తాప్సీ కనపడితే చాలు పరారవుతున్నారు
ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన హాట్ బ్యూటీ తాప్సీ కనపడితే చాలు సినీ జనం పరారవుతున్నారు. దానికి కారణం కనపడ్డ వారందరినీ ఆమె ''నా తెలుగు భాష విన్నారుగా... ఎలా ఉంది..?""అని పదే పదే అడగటమే. ప్రభాస్ తో చేసిన'మిస్టర్ పర్‌ఫెక్ట్"లో ఆమె తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఆ సినిమా హిట్టవటంతో ఆమె ఈ పోటు స్టార్ట్ చేసింది. సినిమా విడుదలై వంద రోజులకు దగ్గర పడుతున్నా...తాప్పీ మాత్రం ఇంకా ఆ సినిమాకు సంబంధించిన తన 'తెలుగు" గురించి అందరినీ అడుగుతూనే ఉంది. స్టార్ హీరోయిన్ కదా అని ఎవరైనా ఆగి బాగుంది..మీ తెలుగు అని కామెంట్ చేస్తే వెంటనే... కనిపించేది ఒకరు, వినిపించేది ఒకరు. తొంభైశాతం హీరోయిన్స్ పరిస్థితి ఇదే. స్వతహాగా ఈ విధానం నాకు అస్సలు నచ్చదు అని వాయించేస్తోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











