సెక్సీ తాప్సీ అప్పుడే మొదలెట్టేసింది
ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల వల్ల ప్రేక్షకులకు నాగురించి ఎంతోకొంత తెలిసింది. కాబట్టి వారికి నచ్చేలా కనిపిస్తూనే మధ్య మధ్యలో నటించే అవకాశం ఉండే పాత్రల్లో చేసుకుంటూ పోవాలి. ఇలా వచ్చి అలా తెరమరుగయ్యే హీరోయిన్ లా కాదు అంటూ సీనియర్ హీరోయిన్ లా మాట్లాడుతోంది తాప్సీ. అది వింటున్న వారు చేసినవి నాలుగు సినిమాలకే అప్పుడే ఇలా నటన,అబిమానులు అంటూ మాట్లాడటం మొదలెట్టింది అంటున్నారు. నిజానకి ఆమె సినిమాలో నటన చేసి ఉంటే ఏమి మాట్లాడినా చెల్లుబాటయ్యేది కానీ ఆమె చేసే గ్లామర్ పాత్రలకి ఆమె పలుకులుకు సంభంధం లేదంటున్నారు.
తెరపై మేం ఏం చేసినా, చేయా ల్సి వచ్చినా అంతా కథానుసారమే. సినిమాలో నేనో లేడీ రౌడీ అనుకోండి. డిష్యూం డిష్యూం అంటూ ఫైటింగ్ చేయాలి. తుపాకీ పట్టుకోవాలి అంతేగాక ఆమె నిజానికి నాకు విభిన్న మైన పాత్రల్లో అలరించాలనుంది.. పదికాలాలపాటు నా పాత్రలు నిలిచిపోవాలి అంటూ సీనియర్ హీరోయిన్ లా మాట్లాడుతోంది. అలాగే 'మిస్టర్ పర్‌ఫెక్ట్', 'వీర' రెండూ వేర్వేరూ ఫలితాన్నిచ్చాయి. 'మిస్టర్ పర్‌ఫెక్ట్'లో మ్యాగీ పాత్రకు మంచి మార్కులే దక్కాయి. 'వీర'లో గ్లామర్ రోల్. నా పాత్ర పరిధిమేరకు చేశాను. నటిగా సంతృప్తినిచ్చాయి అంది.


Click it and Unblock the Notifications











