For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వేషాలు లేకపోయినా వేడిక్కిస్తున్న బిందుమాధవి(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ :గ్లామర్‌ పాత్రలకేకాక అభినయానికి అవకాశం వున్న పాత్రల్లో కూడా రాణించగలనని ఆ మధ్యన విడుదలైన 'సెగ' చిత్రంతో బిందుమాధవి నిరూపించుకుంది. తెలుగులో తన నటజీవితాన్ని ప్రారంభించిన ఆమె ఇప్పుడు తమిళ చిత్రరంగంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె నటిస్తున్న రెండు తమిళ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్నాయి. తెలుగు హీరోయిన్స్ కావాలనే దర్శక,నిర్మాతలు ఎవరూ ఆమెను ప్రోత్సహించటం లేదు. ఆమె వారిని ఆకర్షించేందుకు హాట్ ఫోటో షూట్ చేయించుకుంది. ఆ ఫోటోలుపై ఓ లుక్ వేద్దామా...

  బిందు మాధవికి మొదటి నుంచీ తెలుగు పరిశ్రమ మీద కంటే తమిళ పరిశ్రమ మీదే దృష్టి ఎక్కువ. తమిళ పరిశ్రమలో సెటిల్ కావాలని ఆమె మెదటి నుంచీ చెప్తూ వచ్చింది. దానికి తగినట్లే ఆమెకు తెలుగులోనూ పెద్దగా ఆఫర్స్ రాలేదు. పొగ లాంటి చిత్రాలు ఆమె చేతిలో ఉన్నా అవి ఆమెకు ప్లస్ అయ్యేటట్లు కనపడటం లేదు. కమర్షియల్ హీరోయిన్ కావాలని ఆమె హాట్ ఫోటో షూట్ లు చేసుకుని మరీ వదులుతోంది. దీనితో అయినా తెలుగు,తమిళ దర్శక,నిర్మాతల దృష్టి తనపై పడి తన కెరీర్ ముందుకు సాగుతుందని భావిస్తోంది.

  చిత్తూరు జిల్లా మదనపల్లి లో పుట్టి, వెల్లూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బిటెక్‌ చదివిన బిందుమాధవి మోడల్‌గా, ఆ తర్వాత నటిగా ప్రయాణం మొదలుపెట్టింది. అయితే ఆమె తొలి చిత్రం ఆవకాయ బిర్యాని ఆశించిన విజయం సాధించలేదు.


  ''తెరమీద నన్ను నేను చూసుకోవాలన్నదే ఎల్లప్పుడూ నా కల. నా ఆలోచనలు తెలిసిన మా నాన్న నాతో ఆరునెలలు మాట్లాడడం మానేశారు.త అయితే నేను నా పోర్ట్‌ఫోలియో తీసుకొని, చెన్నైలో పేయింగ్‌ గెస్ట్‌గా వుండి, కొన్ని ప్రకటనల్లో నటించాను. ఒక ప్రకటనలో నన్ను చూసిన 'ఆవకాయ్‌ బిర్యానీ' దర్శకుడు అవకాశం ఇచ్చారు.

  నాకు తమిళంలోనే మొదటి అవకాశం వస్తుందనుకున్నా, కాని తెలుగులో వచ్చింది. అయితే ఆశతో చెన్నైకి తిరిగి వచ్చాను. ఇక్కడ పెద్ద తార కావలనుకుంటున్నాను

  బిందుమాధవి ఫైటింగ్‌లో పాఠాలు నేర్చుకుంటోంది. త్వరలో ఈమె సాహస కృత్యాలను ప్రేక్షకులు చూడబోతున్నాం. వరుస విజ యాల దర్శకుడు పాండిరాజ్ పసంగ చిత్రం తర్వాత తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం కేడి బిల్లా కిలాడి రంగా, విమల్, శివకార్తికేయన్ నటిస్తున్న ఈ చిత్రంలో బిందుమాధవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఈమె పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది.

  అంజన దర్శకత్వం వహించిన 'సెగ'లో బిందుమాదవి వేశ్య పాత్రను పోషించింది. ''యూట్యూబ్‌లో ఒక తెలుగు పాటలో నన్ను అంజన చూసింది. 'సెగ'లో పాత్రకోసం నన్ను సంప్రదించింది'' అని తెలిపింది. అయితే ఆ చిత్రం ఆడలేదు.

  సాయిరామ్ శంకర్ సరసన నటించిన బంపర్ ఆఫర్ చిత్రం చేసింది. సినిమా హిట్టైనా ఆమెకు రావాల్సిన పేరు రాలేదు.

  నాని హీరోగా అశోక్‌ దర్శకత్వం వహించి 'పిల్ల జమీందార్‌'లో లోనూ కనిపించింది. ఈ చిత్రంది సేమ్ సిట్యు వేషన్. సినిమా హిట్టు..ఆమెకు ఆఫర్స్ నిల్

  English summary
  Bindu Madhavi is a South Indian Actress who acted in Telugu and Tamil Movies. She has made her debut in Telugu Movie Avakai Biryani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X