నాకా పిచ్చి ఉంది ఏం చెయ్యను...చార్మి
మరీ ఇంత పిచ్చా? అని ఆశ్చర్యపోతున్నారా? నమ్మశక్యంగా కూడా లేదు కదూ..కానీ ఇది నిజం' అంటోంది చార్మి. ఆమెకు గల తిండి పిచ్చి గురించి చెబుతూ ఇలా స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమె ఈ విషయంపై మాట్లాడుతూ..."మీకో విషయం తెలుసా? నోరు కట్టేసుకోవడం నావల్ల కాని పని. నాకు జిహ్వ చాపల్యం ఎక్కువ. కళ్ల ముందు నచ్చిన ఆహారం ఉంటే ఓ పట్టు పట్టకుండా ఉండలేను. నా స్కూల్ డేస్‌లో నా ఫ్రెండ్స్ కొంతమంది బరువు పెరుగుతారనే భయంతో మధ్యాహ్నం భోజనం చేసేవాళ్లు కాదు. వాళ్ల టిఫిన్ బాక్సులు కూడా నేనే ఖాళీ చేసేదాన్ని. అయినా కడుపులో ఇంకాస్త ఖాళీ ఉన్నట్లుగానే అనిపించేది. స్కూల్‌కెళ్లేప్పుడు రోజూ 10 రూపాయలు తీసుకెళ్లేదాన్ని. మధ్యాహ్నం నా టిఫిన్ బాక్స్‌తో పాటు మిగతావాళ్లవి కూడా ఖాళీ చేసిన తర్వాత క్యాంటీన్‌కి వెళ్లిపోయి ఆ పది రూపాయలతో 'వడా పావ్' కొనుక్కుని తీనేసేదాన్ని అంటూ తనకు తిండి పై గల మక్కువను వివరించింది చార్మి. చార్మి ప్రస్తుతం తెలుగులో మంత్ర డైరెక్టర్ మలి ప్రయత్నం మంగళ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











